Tollywood Most Profitable Movies: తెలుగులో ఈ యేడాది బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ ఫస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ. 80 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
తెలుగులో ‘కల్కి’ విడుదలైన రెండు వారాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాదు.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా చూసుకుంటే తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ఈ సినిమా ప్లేస్ ఎక్కడంటే..
1.బాహుబలి 2 : రూ. 508 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా (రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)
2.బాహుబలి 1 : 186 కోట్ల లాభాలు.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా (రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)
3.RRR : రూ. 163.03 కోట్ల లాభాలు... ఆర్ఆర్ఆర్ (రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)
4.హనుమాన్ : రూ. 127-95 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా (రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)
5.కల్కి 2898 AD : రూ. 100 కోట్ల లాభాలు (2 వారాలు).. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా (రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)
6.అల వైకుంఠపురములో : రూ. 75.88 కోట్ల లాభాలు.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా (రూ. 84.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)