Tollywood Celeb's Dog Breeds: తెలుగు సినీ సెలబ్రిటీలలో రామ్ చరణ్ కుక్క రేటే ఎక్కువ.. ఎన్ని లక్షలో తెలుసా..?

Tollywood stars dog breeds: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు దాదాపు అన్ని సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు కుక్క పిల్లలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సెలబ్రిటీలు పెంచుకుంటున్న కుక్కపిల్లలు ఏ జాతికి చెందినవి అనే విషయం మీద కూడా చాలామంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలకు చెందిన కొన్ని కుక్కపిల్లలు ఏ బ్రీడ్ కి చెందినవి అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 

 
  • Apr 06, 2023, 17:03 PM IST

 

 
1 /5

విజయ్ దేవరకొండ తన ఇంట్లో సైబీరియన్ హస్కీ కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు. సైబీరియా జాతికి చెందిన ఈ కుక్క పిల్ల ఖరీదు దాదాపు 50 వేల పైమాటే. విజయ్ దేవరకొండ ఇంట్లో ఉంటే దాంతోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటాడు.    

2 /5

సమంతకి తాను పెంచుకునే కుక్కలు అంటే చాలా ఇష్టం. నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు ఫ్రెంచ్ బుల్ డాగ్ ఒకదాన్ని తెచ్చుకొని దానికి హాష్ అనే పేరు పెట్టింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఒరిజినల్ బుల్ డాగ్ తెచ్చుకొని దానికి సాష అనే పేరు పెట్టింది. ఇక ఈ కుక్కల ధరలు దాదాపు 9,000 నుంచి 90000 వరకు పలుకుతున్నాయి. 

3 /5

రష్మిక మందన కాకర్ స్పానియల్ అనే జాతికి చెందిన కుక్క పిల్లను పెంచుకుంటుంది. షూట్ గ్యాప్లో దాంతోనే సమయం గడపడానికి ఆమె ఈ మధ్య ఎక్కువగా ఇష్టపడుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీని ఖరీదు దాదాపుగా 30 వేల పై మాటే.

4 /5

రామ్ చరణ్ ఈ మధ్యనే ఫ్రెంచ్ బార్బేట్ అనే జాతికి చెందిన కుక్క పిల్లని కొనుగోలు చేశాడు. దానికి రైమ్ అనే పేరు కూడా పెట్టాడు. ముంబై నుంచి అనకాపల్లి వరకు ఎక్కడికి వెళ్లినా దాన్ని వెంటపెట్టుకుని తిరుగుతున్నాడు, ఈ జాతి కుక్కపిల్ల ద్వారా లక్ష పాతికవేల నుంచి రెండున్నర లక్షల వరకు పలుకుతుంది.

5 /5

కీర్తి సురేష్ సినీ సెలబ్రిటీలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. అదేంటంటే తాను కొనుక్కుని తెచ్చుకున్న షిట్ జూ కుక్కపిల్లకు నైక్ అనే పేరు పెట్టడమే కాదు. సోషల్ మీడియా అకౌంట్ కూడా క్రియేట్ చేసింది. ఈ కుక్కపిల్ల మార్కెట్లో దాదాపు 30 నుంచి 50 వేల వరకు ధర పలుకుతోంది.