Krithi Shetty: బ్లాక్ డ్రెస్ లో కృతి శెట్టి పరువాల విందు.. హీట్ పుట్టిస్తోన్న బేబమ్మ లేటెస్ట్ ఫోటో షూట్..

Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు తెరపై ‘ఉప్పెన’లా  ఎగిసిపడిన కొత్త అందం. తొలి సినిమాతోనే  ఓవర్ నైట్ పాపులర్ అయింది. కానీ టాప్ హీరోయిన్ లీగ్ లోకి ప్రవేశించక ముందే  ఈ అమ్మడి దూకుడు తగ్గింది. అందుకే వరుస ఫోటో షూట్స్ తో అలరించింది.

1 /6

కృతి శెట్టి  మొదటి మూడు చిత్రాలు వరుస  సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ పలకరించడంతో  ఈ అమ్మడి క్రేజ్ కు  బ్రేకులు పడ్డాయి, రీసెంట్ గా ‘మనమే’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.

2 /6

కృతి శెట్టి.. ‘ఉప్పెన’'శ్యామ్ సింగరాయ్', ‘బంగార్రాజు’ వంటి  వరుస మూడు  హాట్రిక్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో  హాట్ బేబ్ గా మారింది. ఆ తర్వాత ఈ అమ్మడి అదృష్టం ఒక్కసారిగా తలకిందులైంది. 

3 /6

కృతి శెట్టి కెరీర్ లో హాట్రిక్ హిట్స్ తో పాటు హాట్రిక్ ఫ్లాపులున్నాయి ఈ అమ్మడి కెరీర్ లో ఉన్నాయి. ఆ త్వాత కృతి శెట్టి నుంచి వచ్చి చిత్రాలు ఫ్లాప్ కావడంతో  ఆమె కెరీర్‌ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

4 /6

మెగా మేనల్లుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన’ మూవీతో కథానాయికగా  తెలుగు తెరకు పరిచయం అయింది కృతి శెట్టి. అంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30'లో ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది. కెరీర్ మొదట్లోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్స్‌తో హాట్రిక్ భామ అనిపించుకుంది.

5 /6

ఆ తర్వాత వరుసగా 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా నడవకపోవడంతో  అమ్మడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

6 /6

రీసెంట్ గా శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ సినిమాతో పర్వాలేదనిపించింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు సినిమాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x