Kushboo regrets acting: రజనీకాంత్ హీరోగా నటించిన అన్నాత్తే సినిమా కారణంగా తనకు అన్యాయం జరిగిందని కుష్బూ వెల్లడించింది. తనకు చెప్పిన కథ వేరని సినిమా విడుదలయ్యాక ఇంకోలా వచ్చిందని తెలిపింది.. ప్రస్తుతం ఈ నటి చేసిన ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది న్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్, కోలీవుడ్లో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఖుష్బూ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఒకవైపు రాజకీయాలలో, మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ తన కెరీర్లో తాను ఎదుర్కొన్నటువంటి కొన్ని ఇబ్బందుల గురించి మాట్లాడడమే కాకుండా, ఇప్పటివరకు చేసిన చిత్రాలలో ఎందుకు యాక్ట్ చేశానా? అనే సినిమాలు కూడా ఉన్నాయంటూ ఆశ్చర్యపరిచింది.
ఖుష్బూ మాట్లాడుతూ.. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే అలాంటి లిస్టులో ఎక్కువగా ఉన్నాయంటూ తెలియజేసింది కుష్బూ. ముఖ్యంగా రజనీకాంత్ తో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశానని వెల్లడించింది.. ఇప్పటివరకు తాను ఎన్నో చిత్రాలలో నటించినా కూడా కొన్ని సినిమాలలో మాత్రం ఎందుకు యాక్ట్ చేశానా అని బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయంటూ వెల్లడించింది.
ముఖ్యంగా హిందీకి సంబంధించి అలాంటి ప్రాజెక్టులు ఏవి లేవు కానీ.. దక్షిణాది ఇండస్ట్రీలో నటించిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే కొన్నేళ్ల క్రితం విడుదలైన రజినీకాంత్ చిత్రం అన్నాత్తే (పెద్దన్న) అంటూ తెలిపింది. ఈ చిత్రంలో మీనా, తాను కలిసి నటించామని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో కీలకమైన పాత్రలు అంటూ మొదటి తమ ఇద్దరికీ చెప్పారని.. రజనీకాంత్ తో డ్యూయెట్స్ ఉంటాయని కూడా వెల్లడించారు అని తెలిపింది.
అలాగే రజనీకాంత్ కు జోడీగా ఎవరు ఉండరని కూడా తెలియజేశారని, అందుకే ఆ ప్రాజెక్టుని ఒప్పుకున్నామని కానీ తన పాత్ర నచ్చింది కానీ సినిమా పట్టాలెక్కే సమయానికి ఒక్కసారిగా అంతా తారుమారు అయింది అంటూ తెలిపింది ఖుష్బూ.. అయితే ఖుష్బూ సినిమా పేరు చెప్పలేదు కానీ.. ఏమి చెప్పింది మాత్రం అన్నాత్తే సినిమా గురించి అంటూ పలువురు భావిస్తున్నారు.
డైరెక్టర్ శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2021 లో విడుదలయ్యింది. ఇందులో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్ వంటి వారు కూడా నటించారు. ఈ సినిమాని తెలుగులో పెద్దన్న పేరుతో రిలీజ్ చేశారు.