Realme GT 7 Pro Price: భారత మార్కెట్లోకి Realme GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Realme GT 7 Pro Price And Specs: రియల్మీ (Realme) నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో ఈ మొబైల్ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme GT 7 ప్రో పేరుతో విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ Realme GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5800 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ 120W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా 11 నిమిషాల్లో 50% శాతం వరకు ఛార్జింగ్ ఫుల్ చేస్తుంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 4.32 GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన Adreno 830 GPUని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ 12 GB LPDDR5X ర్యామ్‌తో విడుదల కాబోతోంది. దీని ద్వారా కూడా సులభంగా గేమింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో రెండు 50 MP ప్రైమరీ సెన్సార్ కెమెరాలతో వస్తోంది. అలాగే 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 16 MP వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు డ్యూయల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు 8K రిజల్యూషన్ సెటప్‌తో వచ్చింది.
ఈ Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల LTPO AMOLED డిస్ప్లేతో విడుదలైంది. అంతేకాకుండా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో విడుదలైంది. అలాగే 1264 x 2780 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో లభిస్తోంది.
ఇక Realme GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్ రెండు కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. ఇక దీని ధర చూస్తే..రూ.59,998 నుంచి విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.