Summer Season: కొందరు టీని అతిగా తాగుతుంటారు. అసలు రోజు ప్రారంభం కావాలంటేనే పొట్టలో చాయ్ పడాల్సిందే. ఖాళీ పొట్టతో చాయ్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..
మనలో చాలా మంది చాయ్ లకు బానిసలుగా ఉంటారు. ఇలాంటి వారు పొద్దున చాయ్ తాగంది ఏపని కూడా చేయరు. కానీ ఖాళీ పొట్టతో చాయ్ తాగడం వల్ల, కడుపులో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి.
వేడి వేడిగ చాయ్ లు తాగడం వల్ల కడుపులోని పేగులు కూడా తీవ్రంగా ప్రభావితమౌతాయి. కొందరు రిఫ్రేష్ కోసం టీని తరచుగా తాగుతుంటారు. సమ్మర్ లో టీని మాత్రం కాస్తంతా అవాయిడ్ చేయాలంట..
ముఖ్యంగా ఏదైన పదార్థం తిన్నాక.. మాత్రమే టీ కానీ, కాఫీలు కానీ తాగాలి. లేకుంటే పొట్టలో ఇబ్బందులు వస్తుంటాయి. టీ అతిగా తాగే వారికి ఆకలి మందగిస్తుంది.
సమ్మర్ లో బైటీ వాతావరణం, వేడిగా ఉంటుంది. అందుకే ఈకాలంలో టీ తాగడం తగ్గించాలి. కొందరు రాత్రి పడుకునే ముందు కూడా టీని తాగుతుంటారు. ఇలాంటి వారిలో నిద్ర అస్సలు ఉండదు.
ప్రెగ్నెంట్ మహిళలు కూడా టీ తాగడం తగ్గించాలి. చాయ్ ను అతిగా తాగడం వల్ల కడుపులో పిండానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది.
చాలా మందిలో టీ వల్ల ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఆకలి మందగించడం, ఉబ్బరం, చికాకులు, అసౌకర్యం వంటివి కల్గుతాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)