LPG Gas Cylinder Price Hike: పండుగ పూట సామాన్యులకు బిగ్ షాక్ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచేసింది. ఒక్కో సిలిండర్‌పై రూ.62 పెంచింది. దీంతో దీపావళి పండుగ పూట సామాన్యులకు ఈ పెరిగిన ధరలు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర ఎంత తెలుసుకుందాం.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దీపావళి పండుగవేళ బిగ్ షాక్ ఇచ్చాయి. సిలిండర్ ధర రూ.62 పెంచింది. దీంతో ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరిగిన ధరలు నవంబర్ 1 నుంచే అమల్లోకి రానుంది. ఈ ధర ఈ నెల మొత్తం వర్తిస్తుంది.
అయితే, 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఏ మార్పు లేదు. ఆగష్టు నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. జెట్ ఇంధనం ధరలను కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్పు చేశాయి.
19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో పెరిగింది. కోల్‌కతాలో అయితే రూ.1900 దాటింది. అక్టోబర్ రూ.1740 ఉన్న సిలిండర్ ధర రూ.62 పెంచడంతో మెట్రో ప్రధాన సిటీల్లో ఏకంగా రూ.1802 కు చేరింది.
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర 14.2 కేజీలో ఎటువంటి మార్పుచేయలేదు. ఢిల్లీ ప్రధాన నగరంలో రూ.803 వద్ద ఉంది. కోల్‌కత్తాలో రూ.829, ముంబై రూ.802.50, చెన్నై రూ.818.50 ఉంది.
ఇదిలా ఉండగ 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.62 పెరగడంతో ఏకంగా రూ.2,028 కు చేరింది. ప్రతినెలా ఒకటో తారీఖు ఈ సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.