Lunar Eclipse 2023: చంద్ర గ్రహణం ప్రభావం, అక్టోబర్ 28 నుంచి ఈ రాశులకు మహర్దశ

ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14తో ముగిసింది. ఇక మిగిలింది చివరి చంద్ర గ్రహణం. అక్టోబర్ 28న చివరి చంద్ర గ్రహణం ఉంది. శరద్ పౌర్ణిమ రోజు రాత్రి చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించనుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడినా కొన్ని రాశులకు మాత్రం అత్యంత లాభదాయకం కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Lunar Eclipse 2023: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14తో ముగిసింది. ఇక మిగిలింది చివరి చంద్ర గ్రహణం. అక్టోబర్ 28న చివరి చంద్ర గ్రహణం ఉంది. శరద్ పౌర్ణిమ రోజు రాత్రి చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించనుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడినా కొన్ని రాశులకు మాత్రం అత్యంత లాభదాయకం కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

1 /5

చంద్ర గ్రహణం సమయం అక్టోబర్ 28న ఈ ఏడాది అంటే 2023లో చివరి చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 28 రాత్రి 11.32 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 3 గంటల 56 నిమిషాలకు పూర్తవతుంది. ఇండియా సహా ఇతర దేశాల్లో చంద్ర గ్రహణం కన్పించనుంది.

2 /5

వృశ్చిక రాశి వృశ్చిక రాశి జాతకులకు చంద్ర గ్రహణం లాభదాయకం కానుంది. ఊహించని చోటి నుంచి ధనలాభం ఉంటుంది. అప్పుల్నించి ఉపశమనం లభిస్తుంది. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. 

3 /5

ధనస్సు రాశి  అక్టోబర్ 28వ తేదీన చంద్ర గ్రహణం కారణంగా ధనస్సు రాశి జాతకులకు అత్యధిక ప్రయోజనం కలగనుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు ఊహించని లాభాలు కలగవచ్చు. 

4 /5

మిధున రాశి చంద్ర గ్రహణం మిధున రాశిపై విశేషమైన ప్రభావం చూపించనుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు లాభం చేకూర్చనుంది. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందడంతో ఆర్ధికంగా ఇబ్బందులుండవు.

5 /5

వృషభ రాశి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృషభ రాశి జాతకులకు చంద్ర గ్రహణం లాభాలు తెచ్చిపెట్టనుంది. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. జీవితంలో గోల్డెన్ డేస్ ప్రారంభం కావచ్చు.