Emmanuel macron kiss: పారిస్ ఒలింపిక్స్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా మహిళా క్రీడల మంది హత్తుకుని ముద్దులు పెట్టేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
విశ్వక్రీడలు పారిస్ వేదికగా అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పారిస్ లోని.. సీన్ నదిలో ఒలింపిక్స్ ప్రారంభవేడుకల ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఫ్రాన్స్ అధ్యక్షుడే మేక్రాన్, క్రీడల మంత్రి ఎమిలీ కాస్టెరా కూడా హజరయ్యారు. ఏమైందో కానీ.. మహిళ మంత్రి ఒక్కసారిగా మేక్రాన్ ను గట్టిగా హత్తుకున్నారు.
అంతటితో ఆగకుండా.. ఆయనను గాఢంగా ముద్దు పేట్టేశారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ తో చూస్తు ఉండిపోయారు. ఈ పరిణామంతో మెక్రాన్ కాస్తంతా అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఎమిలీ కాస్టెరా మాత్రం చాలా క్యాజువల్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దులకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ మాడమ్ ఫిగారో తన కెమెరాలో బంధించినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోను తమ పత్రికలో కథనంగా ప్రచురించింది. ‘ఈ ముద్దు చాలా హాట్ గురు.. అంటూ రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ప్రపంచ క్రీడా వేదికల వద్ద ఇలాంటి పనులు ఏంటని తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఒక.. ఉన్నత హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమంలో ఇలానేనా ప్రవర్తించేది..?’ అంటూ చివాట్లు పెడుతున్నారు. . ఈ ముద్దుల ఘటన మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా.. ఒలింపిక్స్ ముందు క్రీడల మంత్రి ఎమిలీ సెన్ నదిలో స్విమ్ చేశారంట. నది చాలా క్లీన్ గా ఉందని అందరికి తెలిసేలా తాను స్విమ్ చేసిందని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైన ఈ ముద్దుల వల్ల మాత్రం ఫ్రాన్స్ అధ్యక్షుడికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని కూడా కొందరు వాదిస్తున్నారు.