Mahanati Savitri Home: బాబోయ్.. మహానటి సావిత్రి ఇంట్లో అది మొత్తం వెండితో నిర్మించారు.. చూస్తే కళ్లు చెదిరిపోతాయ్!

Mahanati Savitri Home: మహానటిగా కీర్తింపబడిన హీరోయిన్ సావిత్రి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వందలాది తమిళ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు సావిత్రి. గుంటూరు జిల్లాలోని ఓ చిన్న మారుమూల గ్రామంలో జన్మించిన ఈమె.. చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకుంది. ఆమెను తన పెద్దనాన్ని పెంచి పోషించి సావిత్రిగా తీర్చిదిద్దారు. 

1 /8

మొదటగా సావిత్రి కళలపై ఆసక్తి ఉండడంతో నాటక రంగంతో ప్రారంభమైన తన నాటక జీవితం పెద్దపెద్ద సినిమాల స్థాయికి చేరుకుంది. ఏ మాత్రం వెనక్కి చూడకుండా వందలాది సినిమాల్లో అద్భుతమైన పాత్రలో నటించింది.   

2 /8

తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ మూవీస్ లో కూడా అద్భుతమైన పాత్రలో నటించి ప్రత్యేకమైన బిరుదును పొందింది. ఆ తర్వాత ఆమె తమిళ నటుడు జెమినీ గణేషన్‌ను వివాహం చేసుకుంది.   

3 /8

జెమినీ గణేషన్‌, సావిత్రి వీరిద్దరూ కొన్ని సంవత్సరాలపాటు చెన్నైలోని అభివుల్లా రోడ్డలోని ఇంద్ర భవనంలో జీవనం కొనసాగించారు.

4 /8

అయితే ఇటీవలే జెమినీ గణేషన్‌తో సావిత్రి కలిసి ఉన్న ఇంటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

5 /8

చెన్నైలో ఉన్న సావిత్రి ఇంటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఇటీవలే బయటపడ్డాయి. ఆమె జీవనం కొనసాగించిన ఇంటిలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వెండితో ఉంటుందట.  

6 /8

అంతేకాకుండా ఆమె జెమినీ గణేషన్ తో కలిసి ఉన్న సమయంలో నిర్మించిన ప్రత్యేకమైన ఫంక్షన్ హాల్ కూడా ఇప్పటికీ ఉందని సమాచారం..

7 /8

అలాగే సావిత్రి ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన గార్డెన్ ఉండేది. ఇది అప్పట్లో దాదాపు ఒక కిలోమీటర్ పాటు ఉండేదని సమాచారం..  

8 /8

ఇప్పటికీ చెన్నైలోనే ఉండే సావిత్రి నిలయం దాదాపు 5 ఎకరాలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఇందులోని ఉండే కొన్ని ప్రత్యేకమైన భవనాలను ఇతరులు కొనుగోలు చేసినట్లు కూడా సమాచారం.