Sitara in Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో మహేశ్ బాబు కూతురు సితార హల్‌చల్ చూశారా, అందరి చూపు సితారపైనే

అంగరంగ వైభవంగా, అతిరధ మహారధుల సమక్షంలో నభూతో న భవిష్యత్ రీతిలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి జరిగిపోయింది. దేశ విదేశాల్నించి ప్రముఖులు తరలివచ్చారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ మొత్తం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ హాజరైంది. మొత్తం అందరిలో ఓ 11 ఏళ్ల అమ్మాయి అందరితో సెల్ఫీలు దిగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ అమ్యాయి ఎవరో చూద్దామా

Sitara in Anant Ambani Wedding: అంగరంగ వైభవంగా, అతిరధ మహారధుల సమక్షంలో నభూతో న భవిష్యత్ రీతిలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి జరిగిపోయింది. దేశ విదేశాల్నించి ప్రముఖులు తరలివచ్చారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ మొత్తం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ హాజరైంది. మొత్తం అందరిలో ఓ 11 ఏళ్ల అమ్మాయి అందరితో సెల్ఫీలు దిగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ అమ్యాయి ఎవరో చూద్దామా

1 /7

మేటి నటి రేఖాతో ఇప్పటికే అనంత్ అంబానీ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో 11 ఏళ్ల అమ్మాయి బాలీవుడ్, హాలీవుడ్ తారలతో పోజులిస్తూ సెల్ఫీలు దిగుతూ అందర్నీ ఆకర్షించింది. బాలీవుడ్ అలనాటి మేటి నటి రేఖా అయితే ఈ అమ్మాయిని కౌగిలించుకుని సెల్ఫీకు పోజిచ్చింది. ఈ అమ్మాయి మరెవరో కాదు..సూపర్‌స్టార్ మహేశ్ బాబు ముద్దుల తనయ 11 ఏళ్ల సితార. 

2 /7

ఐశ్వర్యా రాయ్‌తో సెల్ఫీ ఈ ఫోటోలో సితార మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ , ఆమె కుమార్తె ఆరాధ్యతో పోజులిస్తూ కన్పిస్తోంది. ఈ ఫోటోలో సితార తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా ఉంది. 

3 /7

రణబీర్ కపూర్‌తో సితార ఈ ఫోటోలో సితార బాలీవుడ్ సూపర్‌స్టార్ రణబీర్ కపూర్‌తో ఫుల్ మస్తీ చేస్తూ పోజులిచ్చింది. ఇద్దరి ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది. 

4 /7

ప్రియాంకా చోప్రా-నిక్ జోనస్‌తో ఇందులో గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా ఆమె భర్త నికీ జోనస్‌తో పోజులిస్తూ కన్పించింది. ఇలా అందరితో సితార దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

5 /7

మహేశ్ బాబు-నమ్రతాతో చివరిగా ఈ ఫోటో తల్లిదండ్రులు మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్‌తో సితార పోజులు

6 /7

హాలీవుడ్ నటి కిమ్ కార్దిషియన్‌తో  ఇందులో సితార హాలీవుడ్ టాప్ నటి కిమ్ కార్దిషియన్‌తో పోజులిస్తూ పోటో దిగింది. 

7 /7

కియా అద్వానీ-సిద్ధార్ధ్ మల్హోత్రాతో బాలీవుడ్ బెస్ట్ అండ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ-సిదార్ధ మల్హోత్రాతో సితార ఫోటోకు పోజులిచ్చింది.