Malavika Mohanan: గ్లామర్ తో మరోసారి కుర్రాళ్ల మతులు పోగుడుతున్న ప్రభాస్ భామ మాళవిక మోహనన్..

Malavika Mohanan:మాళవిక మోహనన్ కేరళ కుట్టీ అయిన ఈ భామ తన గ్లామర్ తో వార్తల్లో నిలిచింది.  ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. మారుతి దర్శకత్వంలో  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న 'ది రాజా సాబ్' మూవీతో హీరోయిన్ గా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ భామ ఎప్పటికపుడు వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. 

1 /5

మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ బిడ్డగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో ఒక్కసారిగా ఈమె ఫేట్ మారిపోయింది.

2 /5

2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహనన్. ఆ తర్వాత నిర్ణాయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా తన లక్ పరీక్షించుకుంది. 

3 /5

హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో ఉత్తరాది ప్రేక్షలను అలరించింది మాళవిక మోహనన్.  

4 /5

మాస్టర్ మూవీ కంటే ముందు రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక మోహనన్. మొత్తంగా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన మాళవిక మోహనన్.. వీలైనంత తొందరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

5 /5

ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో కథానాయికగా మాళవిక మోహనన్ కెరీర్ పరుగులు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఈ మూవీ తర్వాత మాళవికకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా సత్తా చూపెడుతుందా లేదా అనేది చూడాలి. .