MG Windsor EV Price: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మార్కెట్లోకి ఇటీవలే కొత్త EV కారును అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభించబోతోంది. దీనిని కంపెనీ విండ్సర్ EV (MG Windsor EV) పేరుతో తీసుకు వచ్చింది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ధరలను కూడా ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రూ.9.99 లక్షలతో అందుబాటులోకి తీసుకు రానుంది.
ఇప్పటికే ఈ ఎంజీ మోటర్స్ కంపెనీ కార్లకు సంబంధించిన యునిట్లను కూడా షో రూమ్‌లకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనే వీటిని కొనుగోలు చేసేవారికి టెస్ట్ డ్రైవ్‌ల కోసం ప్రత్యేకమైన కార్లను కూడా షో రూమ్‌లకు తీసుకు వచ్చింది.
MG విండ్సర్ (MG Windsor EV) ఎలక్ట్రిక్ కారును కంపెనీ మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందలో మొదటి వేరియంట్ EV ఎక్సైట్, రెండవ వేరియంట్ ఎక్స్‌క్లూజివ్, మూడవది ఎసెన్స్ పేరుతో మార్కెట్లోకి రానుంది.
ఇక ఈ కారును కంపెనీ నాలుగు స్టోరేజ్ ఆప్షన్లో తీసుకు రానుంది. అంతేకాకుండా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 331కిమీ వరకు ప్రయాణం చేస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది.
ఈ MG విండ్సర్ EV (MG Windsor EV) ఎంతో శక్తివంతమైన 38kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 134bhp శక్తితో పాటు 200Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఇది వివిధ రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ కారు ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇందలోని లోపలి భాగంలో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా టాప్-స్పెక్ ఎసెన్స్ వేరియంట్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూడు వేరియంట్స్‌లో 360-డిగ్రీ సరౌండ్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కూడా ఉంటుంది. ఇది వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో అందుబాటులోకి రానుంది.