OTT Movies: 'దేవర' టికెట్లు దొరకలేదా.. అయితే ఈవారం ఓటీటీలో భారీ సినిమాలు చూసేయండి

This Week OTT Telugu Movies: టీవీలు, ల్యాప్‌ట్యాప్‌, ట్యాబ్‌ల్లో ఎంచక్కా ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు చక్కటి వేదిక ఓటీటీలు. ఈవారం ఓటీటీల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. నాని సరిపోదా శనివారం ప్రధానమైన సినిమా రాబోతున్నది. ఇక వాటితోపాటు ఇంకా ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.

1 /7

ఈ వారం ఓటీటీ వేదికల్లో భారీగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల అవుతున్నాయి.

2 /7

ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు సిద్ధమైపోండి. థియేటర్‌లో దేవర సినిమా వస్తుండగా దానికి పోటీగా ఓటీటీలో భారీ సినిమాలు వస్తున్నాయి.

3 /7

సరిపోదా శనివారం: ఆగస్టు 29వ తేదీన థియేటర్‌లలో విడుదలైన మంచి విజయాన్నందుకున్న సరిపోదా శనివారం ఓటీటీలోకి రానున్నది. సెప్టెంబర్‌ 26వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

4 /7

ప్రతినిధి 2: ఎన్నికల ముందు విడుదలైన ప్రతినిధి 2 సినిమా తాజాగా బుల్లితెరపై రానుంది. నారా రోహిత్‌ నటించిన ప్రతినిధి 2 ఆహాలో సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కానుంది.

5 /7

కిల్: ఇక డబ్బింగ్‌ సినిమాల్లో కిల్‌ అతి పెద్ద సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. 2023లో విడుదలైన ఈ సినిమా తెలుగులో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ప్రసారం చేస్తోంది.

6 /7

సోపతులు: ఇక ఈటీవీ విన్‌ యాప్‌లో సోపతులు అనే అచ్చమైన తెలంగాణ పల్లెతనంతో కూడిన సినిమా స్ట్రీమ్‌ అవుతోంది. నైంటీస్‌ కిడ్స్‌ తర్వాత మళ్లీ అంతటి ఆసక్తితో ఇది విడుదలైంది.

7 /7

స్త్రీ 2: బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన స్త్రీ 2 అప్పుడే ఓటీటీలోకి వస్తోందని పుకార్లు వస్తున్నాయి. అకస్మాత్తుగా ఓటీటీలోకి విడుదల కాబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతుందని ప్రచారం సాగుతోంది.