Modi about ANR: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ఈ కార్యక్రమంలో ఏఎన్ఆర్ పేరు ప్రస్తావించి, ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడంతో.. ఎన్టీఆర్ అభిమానుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతోమంది తెలుగువారి మనోభావాలను మోదీ దెబ్బతీశారు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ప్రతి నెల కూడా చివరి ఆదివారం లో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు 117 వ ఎపిసోడ్లో పలు కీలకమైన విషయాలను సైతం వెల్లడించడం జరిగింది.
ఈసారి ప్రముఖ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు..పేరుని ప్రస్తావించడం జరిగింది నరేంద్ర మోడీ. తెలుగు సినిమాకు ఆయన చేసినటువంటి సేవలను కృషిని గుర్తించి కొనియాడారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమ మరొక స్థాయిలో.. ఉండడానికి ఆయనే కారణమని కూడా తెలిపారు. ఏఎన్ఆర్ చిత్రాలలో భారతీయ సాంప్రదాయ విలువలు బాగా చూపిస్తారని కొనియాడడంతో అభిమానులు కూడా ఆనందపడ్డారు.
అలాగే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తపన్ సిన్హా ను పొగడడం జరిగింది. ఇక రాజ్ కపూర్ సినిమాల ద్వారా ఇండియాలోని సున్నితమైన అంశాలను కూడా ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారని తెలిపారు. అయితే నరేంద్ర మోడీ ఇలా కామెంట్లు చేయడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ప్రధాని అని కూడా ఆలోచించకుండా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి తెలుగు సినీ పరిశ్రమను జాతీయస్థాయి లెవల్లో తీసుకు వెళ్లిన వారిలో ఎక్కువగా నందమూరి తారక రామారావు , ఏఎన్ఆర్ పేర్లు వినిపిస్తాయి.
అయినప్పటికీ నరేంద్ర మోడీ మాత్రం సీనియర్ ఎన్టీఆర్ పేరుని చెప్పకుండా కేవలం నాగేశ్వరరావు పేరుని చెప్పడంతో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో.. విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.
నెటిజన్స్ మాత్రం.. ప్రధాన మోడీ ఎన్టీఆర్ పేరుని కూడా ప్రస్తావించుంటే బాగుండు అంటూ కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. దీంతో కొంతమంది మాత్రం ఈ విషయాలను కొట్టివేస్తున్నారు.. ఈ విషయం రాజకీయంగా కూడా మారుతున్నది.
ఇది ఇలా ఉండగా మరొకవైపు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, వచ్చేయేడాది మొదటిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ ని కూడా భారత్లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు.