Monkeypox in India: ఇండియాలో మంకీపాక్స్ కలవరం, లక్షణాలు, చికిత్స, టెస్ట్ ఎలా ఉంటాయి

మంకీపాక్స్ లేదా ఎం పాక్స్ మొట్టమొదటి కేసు ఇండియాలో వెలుగు చూసిన తరువాత దేశంలో కలకలం మొదలైంది. కరోనా మహమ్మారిలా ఎక్కడ వెంటాడుతుందననే భయం కలుగుతోంది. అందరిలో ఇదే ఆందోళన నెలకొంది. అసలు ఈ మంకీపాక్స్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.

Monkeypox in India: మంకీపాక్స్ లేదా ఎం పాక్స్ మొట్టమొదటి కేసు ఇండియాలో వెలుగు చూసిన తరువాత దేశంలో కలకలం మొదలైంది. కరోనా మహమ్మారిలా ఎక్కడ వెంటాడుతుందననే భయం కలుగుతోంది. అందరిలో ఇదే ఆందోళన నెలకొంది. అసలు ఈ మంకీపాక్స్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

మంకీపాక్స్ వ్యాధిలో మొదటి లక్షణం ర్యాషెస్. కొంతమంిలో జ్వరం, కండరాల నొప్పి, గొంతు గరగర కూడా ఉండవచ్చు. అరచేయి, పాదాలు, ముఖం, నోరు, గొంతు, ఏనస్ భాగాల్లో ర్యాషెస్ ఏర్పడవచ్చు. మంకీపాక్స్ వైరస్ డిటెక్ట్ చేసే పరీక్ష పీసీఆర్. పోలీమెరేజ్ ఛైన్ రియాక్షన్. ర్యాషెస్ నుంచి శాంపిల్ తీస్తారు. లేదా గొంతు నుంచి స్వాబ్ సేకరిస్తారు.

2 /5

మంకీపాక్స్ లక్షణాలు వారం రోజుల్లో బయటపడవచ్చు. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో అయితే లక్షణాలు బయటపడేందుకు 21 రోజులు పట్టవచ్చు. ఒకసారి లక్షణాలు బయటపడితే 2-4 వారాలుంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో లక్షణాలు మరింత ఎక్కువ కాలం ఉండవచ్చు. 

3 /5

మంకీపాక్స్ వ్యాధి సోకితే ప్రధానంగా శరీరంపై ర్యాషెస్, జ్వరం, గొంతు గరగర, తలనొప్పి, కండరాల నొప్పి, బ్యాక్ పెయిన్, అలసట, నీరసం, లింఫ్ నోడ్స్ వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. 

4 /5

అయితే మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. ఇదేమీ కరోనా వైరస్‌లా మహమ్మారిగా మారదంటున్నారు. మంకీపాక్స్ మరణరేటు ఎక్కువే ఉన్నా సన్నిహిత సంబంధాల్లోనే అది వ్యాపిస్తుందని ఢిల్లీకు చెందిన ప్రొఫెసర్ హర్షల్ ఆర్ సాల్వే చెబుతున్నారు. 

5 /5

దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ తొలికేసు వెలుగుచూసింది. మంకీపాక్స్‌ను ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో వెలుగుచూసిన మంకీపాక్స్ రోగిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది