Pak TV Serials: ఇండియాలో విశేష ఆదరణ పొందుతున్న టాప్ 5 పాకిస్తానీ టీవీ సీరియల్స్ ఇవే

Pak TV Serials: దేశంలో ఎన్నో భాషల్లో మరెన్నో టీవీ సీరియల్స్ . అన్నింటిలో దాదాపుగా అత్తా కోడలు వంటి బోరింగ్ సీరియల్స్ ఎక్కువ. కాస్త విభిన్నమైంది కావాలనుకుంటే...ఈ సీరియల్స్ మంచి ప్రత్యామ్నాయం కాగలదు.
 

Pak TV Serials: ఇండియాలో గత కొద్దికాలంగా పాకిస్తానీ సీరియల్స్ క్రేజ్ పెరిగిపోతోంది. ఇండియాలో పాకిస్తాన్ సీరియల్స్‌ని పెద్దఎత్తున వీక్షిస్తున్నారు. అలాంటి టాప్ 5 సీరియల్స్ గురించి తెలుసుకుందాం..

1 /5

జిందగీ గుల్జార్ హై ఫవాద్ ఖాన్ సీరియల్ ఇది. భారతీయుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఓ మహిళ ఆదారిత కధ ఇది. ఈ రొమాంటిక్ సీరియల్‌కు పాకిస్తాన్‌తో పాటు ఇండియాలో కూడా భారీగా వీక్షకులు ఉన్నారు.

2 /5

సునో చందా కామెడీ, ప్రేమ, ఎమోషన్లు ఈ సీరియల్‌లో కావల్సినంతగా లభిస్తాయి. ఓ ఉమ్మడి కుటుంబం ఏ విధంగా సుఖ దుఖాల్లో తోడుగా ఉంటారో అదంతా సీరియల్ లో ఉంది. పాకిస్తాన్‌లోనే కాదు..ఇండియాలో కూడా ఈ సీరియల్‌కు ఆదరణ పెరుగుతోంది. 

3 /5

సంగ్ ఎ మాహ్ ఈ సీరియల్‌లో ఆతిక్ అస్లం లీడ్ రోల్‌లో కన్పిస్తాడు. ఆదివాసీ కుటుంబాల కధ ఆధారంగా తెరకెక్కిన సీరియల్ ఇది. ఆధునిక యుగం పోకడలు, విధి విధానాల పేరుతో చాలా పోగొట్టుకుంటారు. స్టోరీ లైన్ చాలా స్ట్రాంగ్ కావడంతో బాగా ఆకట్టుకుంటోంది.

4 /5

ఇష్క్ జలేబీ కామెడీ, రోమాన్స్‌కు అద్భుతమైన కాంబినేషన్ సీరియల్ ఇది. ఈ పాకిస్తాన్ సీరియల్‌కు ఇండియాలో చాలా క్రేజ్ పెరుగుతోంది. ఈ షోను యూట్యూబ్‌లో ఉచితంగా చూడవచ్చు.

5 /5

చుప్కే చుప్కే ఈ పాకిస్తానీ డ్రామా షోలో ఓ కపుల్ కధ ఇది. ఈ ఇద్దరూ రోజూ కొత్త సవాళ్లు ఎదుర్కొంటుంటారు. 5 ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోంది.