Periods pain Remedy: పీరియడ్స్ నొప్పి భరించలేకుండా ఉందా, ఈ సింపుల్ ఆసనాలతో ఇట్టే మాయం

Periods pain Remedy: పీరియడ్స్ ప్రతి మహిళ జీవితంలో తప్పనిసరిగా ఎదుర్కోవల్సిన ప్రక్రియ. నెలసరి సమయంలో మహిళలకు భరించలేని నొప్పి ఉంటుంది. ఒక్కోసారి నొప్పి తీవ్రత కారణంగా ఏ పనీ చేసుకోలేకపోతుంటారు. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా రకాల మందులు వాడుతుంటారు. 

Periods pain Remedy: కానీ ఈ నొప్పుల్నించి సహజసిద్ధంగా విముక్తి పొందే మార్గాలున్నాయి. అదే యోగా. కొన్ని రకాల యోగాసనాలు వేయడం ద్వారా పీరియడ్స్ నొప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుందంటున్నారు. 

1 /5

ఉత్తాన్ పదాసనం గోడకు సమీపంలో నేలపై వీపు ఆధారంగా పడుకోవాలి. ఇప్పుడు కాళ్లను పైకి లేపి గోడకు ఆన్చాలి. శరీరాన్ని పూర్తిగా రిలాస్స్ చేయాలి. కొద్దిసేపు ఇలానే ఉండాలి. దీనివల్ల కాళ్లలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

2 /5

శవాసనం వీపుపై పడుకోవాలి. కాళ్లను కొద్దిగా చాపాలి. చేతుల్ని శరీరానికి సమాంతరంగా నేలపై ఉంచాలి. పూర్తిగా రిలాక్స్ మోడ్‌లో ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలడం చేయాలి. దీనివల్ల శరీరాన్ని రిలాక్స్ లభిస్తుంది. నొప్పులు తగ్గుతాయి

3 /5

భుజంగాసనం కడుపుపై పడుకుని చేతులపై శరీరం ముందు భాగాన్ని పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ ఇలా చేయాలి. వీపును ఆర్చ్‌లా వంచాలి. మెడను కాస్త వెనక్కి వంచాలి. ఇలా కాస్సేపు ఉండి తిరిగి మామూలు స్థితికి వచ్చేయాలి. ఈ ఆసనం ద్వారా కడుపులోని అంగాలు పటిష్టమౌతాయి. నొప్పులు తగ్గుతాయి

4 /5

సుప్త బుద్ధకోణాసనం ఈ ఆసనంలో వీపుపై పడుకోవాలి. కాళ్లను మడిచి రెండు మోకాళ్లను కలపాలి. కాలి పాదాలను ఒకదానికొకటి కలపాలి. ఇప్పుడు పాదాల్ని అలాగే కలిపి ఉంచి మోకాళ్లను రెండు వైపులా నేలవైపుకు తీసుకెళ్లాలి. చేతుల్ని శరీరానికి సమాంతరంగా ఉంచాలి. దీనివల్ల పెల్విక్ రీజన్‌లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 /5

బాలాసనం ఈ ఆసనంలో మోకాళ్లపై కూర్చుని రెండు చేతులూ ముదుకు చాచి నేలపై ఆన్చాలి. మీ నుదుటి భాగం నేలకు తాకించాలి. ఇలా కాస్సేపు ఉండాలి. దీనివల్ల కడుపు కండరాలు రిలాక్స్ అయి నొప్పి తగ్గుతుంది.