Multibagger Share: షేర్ మార్కెట్ అంటేనే ఓ వింత ప్రపంచం. ఎప్పుడు ఏ కంపెనీ షేర్ ఆకాశాన్ని తాకుతుందో..ఎప్పుడు ఏది పడిపోతుందో అంచనా కష్టమే. కొన్ని షేర్లు కోటీశ్వరులుగా మార్చేస్తాయి. ఏదైనా షేర్ కొనుగోలు చేసిన తరువాత ఎక్కువ సమయం నిరీక్షిస్తే మీకు మహర్దశ పట్టవచ్చు.
గత నెల రోజుల్లో ఈ కంపెనీ షేర్ 6 శాతం కంటే ఎక్కువే పెరిగింది. ఆరు నెలల్లో దాదాపు 35 శాతం లాభాల్ని ఇచ్చింది.
షేర్ మార్కెట్‌లో 52 వారాల గరిష్టం 1097.40 రూపాయలు కాగా కనిష్టం 730.90 రూపాయలుంది. ఉత్తర ప్రదేశ్‌లోని షాహ్‌జహంపూర్‌లో 200 ఏళ్ల నాటి యూనిట్ మూసివేసింది. మెక్‌డోవెల్స్, రాయల్ ఛాలెంజ్, సిగ్నేచర్, జానీ వాకర్, బ్లాక్‌డాగ్ బ్రాండ్లు ఈ కంపెనీవే కావడం గమనార్హం.
ఎవరైనా ఈ కంపెనీ షేర్ కొనుగోలు తరువాత ఇప్పటివరకూ విక్రయించకుండా ఉండి ఉంటే 10 వేల పెట్టుబడి 16 లక్షల రూపాయలయ్యేది. 22 ఏళ్ల క్రితం యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ షేర్ 6.55 రూపాయలు మాత్రమే. ఇప్పుడీ కంపెనీ షేర్ గురువారం మార్కెట్ ముగిసేసరికి 1057.75 రూపాయలైంది.
బ్రిటన్‌కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ డియోజియో పేరెంట్ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీతో. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు అద్భుతమైన ఊహించని రిటర్న్స్ అందాయి. షేర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 16 వేల శాతం రిటర్న్స్ అందింది.