NASA: ఆ ఒక్క టాయ్‌లెట్ ఖర్చు 174 కోట్లు..నమ్మడం లేదా

 

NASA: అంతరిక్షంలో నాసా సంస్థ.. ఖరీదైన టాయ్‌లెట్స్  నిర్మిస్తోంది.  ఈ యేడాది ఏకంగా 174 కోట్ల ఖర్చుతో ఓ టాయ్‌లెట్‌ను నాసా అంతరిక్షంలో పంపిస్తోంది.

  • Nov 30, 2020, 19:24 PM IST

NASA: అంతరిక్షంలో నాసా సంస్థ.. ఖరీదైన టాయ్‌లెట్స్  నిర్మిస్తోంది.  ఈ యేడాది ఏకంగా 174 కోట్ల ఖర్చుతో ఓ టాయ్‌లెట్‌ను నాసా అంతరిక్షంలో పంపిస్తోంది.

అంతరిక్షంలో ఇంతలా ఎలా ఖర్చుపెడతారని మీరు ఆలోచిస్తుండవచ్చు. కానీ నానా చేసే ఖర్చు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.నాసా అంతరిక్షంలో కేవలం టాయ్‌లెట్ల కోసమే.. 1 కోటి 86 లక్షల 48 వేల డాలర్లు ఖర్చు చేస్తోందంటే నమ్మగలరా...నిజమే.ఈ వివరాలు చూడండి

 

1 /5

ఈ టాయ్‌లెట్‌లో చాలా విలువైన పరిజ్ఞానాన్ని వినియోగించారు. దీనికింద ప్రత్యేక విధానంలో పైప్, వ్యాక్యూమ్ ట్యూబ్ ప్రయోగిస్తారు. ఇందులో ఉపయోగించే నీళ్లను రీ సైకిల్ చేస్తారు. వేస్ట్‌ను స్టోర్ చేస్తారు.

2 /5

దీనికి ఇంత ఖర్చు ఎందుకనే సందేహం మీకు వస్తున్నట్టుంది కదూ..అంతరిక్ష టాయ్‌లెట్ ..ఏదో సాధారణ టాయ్‌లెట్‌లా ఉండదు. ఇది సూపర్ స్పెషల్ వాక్యూమ్ క్లీనర్‌లా ఉంటుంది. 

3 /5

నాసా నిర్మిస్తున్న అంతరిక్ష టాయ్‌లెట్ ఖర్చు 19 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది మరో కొత్త డిజైన్ టాయ్‌లెట్ డిజైన్ చేశారు. దీని విలువ 23 మిలియన్ డాలర్లు అంటే 174 కోట్ల రూపాయలు. ఈ టాయ్‌లెట్‌ను ‌ చంద్రమండలంపై పంపనున్నారు. 

4 /5

కొత్త డిజైన్ టైటానియమ్. మహిళల కోసం ఇది మునుపటి టాయ్‌లెట్ కంటే మెరుగైనది.

5 /5

కొత్త డిజైన్ టాయ్‌లెట్‌ను చంద్రుడిపై పంపించే ముందు దీన్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌పై పరీక్షిస్తారు.