Nava Panchama Rajayoga: 100 యేళ్ల తర్వాత అరుదైన నవ పంచమ రాజయోగం.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ కటాక్షమే..

Nava Panchama Rajayoga: 100 యేళ్ల తర్వాత జ్యోతిష్య మండలంలో శుక్రుడు, శని దేవుడు కలయిక వలన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ కలయిక వలన ఈ మూడు రాశుల వారి ఇంట్లో సిరి సంపదలతో పాటు ధనలక్ష్మీ కటాక్షం కలబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1 /5

Nava Panchama Rajayoga: 100 యేళ్ల తర్వాత శనీశ్వరుడు, శుక్రుడి కలయిక వలన అరుదైన నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. దీని వల్ల ఈ రాశుల వారికీ జీవితంలో ఉన్నతి, ఉద్యోగంలో ప్రమోషన్, గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది.

2 /5

తులా రాశి.. తులా రాశి వారికి నవ పంచమ రాజయోగంతో గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలు దూది పంజల్లా ఎగిరిపోతాయి. మరోవైపు నవ పంచమ రాజయోగంతో పాటు మాళవ్య రాజయోగం వలన ఋణ విముక్తులవుతారు. అనుకోని ధనం చేతికి అందుతుంది.ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలున్నాయి.

3 /5

మకర రాశి.. నవ పంచమ రాజయోగం వలన మకర రాశి వారి పడుతున్న బాధలు తొలిగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. చేసే వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. చేసే ప్రతి రంగంలో విజయమే తప్ప అపజయం అంటూ ఉండదు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలతో పాటు సవాళ్లను స్వీకరిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. 

4 /5

కుంభ రాశి.. కుంభ రాశి వారికీ వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆస్తి కొనుగోలు చేస్తారు. పూర్వీకుల సంబంధించిన ఆగిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. అదృష్టం సహకరిస్తుంది. విదేశీయాన యోగం ఉంటుంది.

5 /5

గమనిక : ఇక్కడ మేము అందించిన సమాచారం ఇంటర్నెట్ తో పాటు  జ్యోతిషశాస్త్ర పండితులు చెప్పిన అభిప్రాయాలను మాత్రమే మేము ఇచ్చాము. దీన్ని ZEE 24 గంటలు నిర్ధారించడం లేదు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x