Nayanthara Personal Photos: లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార.. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్.. తన ఇద్దరు కొడుకులతో ఎంతో క్వాలిటీ స్పెండ్ చేస్తోంది.
నయనతార కి సౌత్ ఇండియాలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిన ఈ హీరోయిన్.. రజనీకాంత్ హీరోగా చేసిన చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది.
ఆ తరువాత తెలుగు, తమిళంలో వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. కాగా ముఖ్యంగా తమిళంలో నయనతార.. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. అక్కడ ఆమె నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి.
మరోపక్క తెలుగులో కూడా నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోలతో నటించి.. మంచి విజయాలు అందుకుంది. ఈ మధ్యనే షారుక్ ఖాన్ సినిమా.. జవాన్ తో బాలీవుడ్ లోకి సైతం అడుగుపెట్టింది.
ఈ హీరోయిన్ కి ప్రస్తుతం హిందీ నుంచి కూడా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్యనే విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న నయనతార..ఇద్దరు కొడుకులను సరోగసి ద్వారా కన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నయనతార తన భర్త, కొడుకులతో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ వెకేషన్ నుంచి నయనతార ఎంతో క్యూట్ గా తన కొడుకుని ఎత్తుకొని తీసుకున్న ఫోటోలు.. వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.