Nayanathara: బ్లూ చీరలో నయనతార.. ఎప్పుడూ చూడనంత అందాలు!

Nayanthara blue saree looks: నయనతార గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు చంద్రముఖి సినిమాతో పరిచయమైన నయనతార.. ఆ తరువాత ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం నయనతార షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

1 /5

రజినీకాంత్ చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నయనతార. ఆ తరువాత వెంకటేష్ తో చేసిన లక్ష్మీ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. అప్పటినుంచి తమిళం తో పాటు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది ఈ మలయాళీ భామ. 

2 /5

ప్రభాస్ తో యోగి.. వెంకటేష్ తో తులసి.. బాలకృష్ణతో సింహ.. లాంటి సినిమాలలో నటించి .. తెలుగులో సైతం స్టార్ హీరోయిన్గా ఎదిగింది. మరోపక్క తమిళంలో వరస విజయాలు అందుకుంటూ.. అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకుంది. 

3 /5

ముఖ్యంగా తమిళంలో నయనతార ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసి.. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. మరోపక్క షారుక్ హీరోగా చేసిన జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టింది. ప్రస్తుతం అక్కడ కూడా నయనతార వరస అవకాశాలు అందుకుంటున్నట్టు వినికిడి..

4 /5

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే దర్శకుడు విగ్నేష్ ఇవన్నీ పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. అయినా కానీ నయనతార అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కూడా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది ఈ నటి. 

5 /5

ఈ క్రమంలో నయనతార ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బ్లూ చీరలో కనిపిస్తూ అందరిని ప్రేమలో పడేస్తుంది ఈ హీరోయిన్.