Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..

Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి. 
 

1 /7

శ్రావణాన్ని చాలా మంది పండుగల మాసంగా చెప్తుంటారు. ఈ నెలలో.. ముఖ్యంగా.. వరలక్ష్మి వ్రతం, నాగుల పంచమి, జన్మాష్టమి తదతర పండుగలు మనం జరుపుకుంటాం. ఆగస్టు నెల ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమౌతుంది. ఈ క్రమంలో శ్రావణంలో చాలా మంది శివుడిని పంచామృతాలతో అభిషేకం చేస్తుంటారు. 

2 /7

శివుడిని భోళాశంకరుడి అని పిలుస్తుంటారు. శివయ్యకు కేవలం చెంబెడు నీళ్లు, బిల్వదళాలు సమర్పిస్తే ఆయన మన కోరికలన్ని నెరవేరుస్తాడు. అదే విధంగా శివుడిని పూజించేటప్పుడు కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదని పండితులు చెబుతుంటారు. 

3 /7

శివుడిని పూజించేటప్పుడు.. శివుడ్న భూమి మీద పెట్టొద్దంటారు.  తులసీ ఆకుల్ని మాత్రం అస్సలు సమర్పించకూడదంట. తులసి జలంధరుడు అనే రాక్షసుడి భార్య. అందుకే తులసీని శివుడి పూజలో ఉపయోగించకూడదని చెప్తుంటారు. 

4 /7

అదే విధంగా పసుపు, కుంకుమలను కూడా శివుడి పూజలో ఉపయోగించకూడదని చెప్తుంటారు. పసుపు, కుంకుమలు.. జీవితంలో  ఏ శుభకార్యం కూడా పసుపు, కుంకుమలు లేకుండా జరుపుకోము. కానీ శివుడు స్మశానంలో ఎక్కువగా సంచరిస్తాడు. అందుకే ఆయనకు చందనం లేదా భస్మంను సమర్పించాలని చెప్తుంటారు.

5 /7

చెడిపోయిన బిల్వపత్రాలు, ముదిరిపోయిన బిల్వపత్రాలు శివలింగానికి పొరపాటున కూడా సమర్పింకూడదు. కేవలం పూర్ణంగా, పచ్చగా ఉన్న మూడు ఆకులున్న బిల్వపత్రాలను మాత్రమే శివపూజలో ఉపయోగించాలి.

6 /7

శివుడికి చాలా మంది పాలు, పెరుగు, తేనె,నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తుంటారు. ఇలా అభిషేకం చేసేటప్పుడు కంచు పాత్రలను అస్సలు ఉపయోగించకూడదని చెప్తుంటారు. 

7 /7

అదే విధంగా అతి ముఖ్యంగా శివ పూజలో అస్సలు శంఖాన్ని ఉపయోగించకూడదంట. పూర్వం శివుడు శంఖ చవుడు అనే రాక్షసుడిని హతమార్చాడంట. అందుకే శివుడి పూజలో శంఖాన్ని వాడొద్దని జ్యోతిష్య పండితులు చెప్తుంటారు.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)