Indian Railway new time table: రైల్వే టైమ్ టేబుల్ మారింది తెలుసా...ఇదే కొత్త టైమ్ టేబుల్..ఏ ట్రైన్ ఎప్పుడు..

ఇండియన్ రైల్వేస్ టైమ్ టేబుల్ మారింది. ప్రస్తుతం నడుస్తున్న పలు రైళ్ల తేదీలు, వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల తేదీలు, సమయంలో చోటుచేసుకున్న మార్పులిలా ఉన్నాయి..
  • Dec 10, 2020, 13:06 PM IST

Indian Railway new time table: ఇండియన్ రైల్వేస్ టైమ్ టేబుల్ మారింది. ప్రస్తుతం నడుస్తున్న పలు రైళ్ల తేదీలు, వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల తేదీలు, సమయంలో చోటుచేసుకున్న మార్పులిలా ఉన్నాయి..

1 /9

ఇక విశాఖపట్నం-కడప స్పెషల్ ట్రైన్ 07488 నెంబర్ తో ఈ నెల 12 నుంచి 31వ తేదీ వరకూ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి..ఉదయం 7 గంటలకు కడప చేరుతుంది. అటు నుంచి 07487 నెంబర్ ట్రైన్ ఈ నెల 13 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.45 నిమిషాలకు కడపలో బయలుదేరి..ఉదయం 11.30 నిమిషాలకు విశాఖపట్నం చేరుతుంది. 

2 /9

విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ స్పెషల్ ట్రైన్ 02869 నెంబర్ తో ఈ నెల 14 నుంచి 28వ తేదీ వరకూ ప్రతి సోమవారం రాత్రి 7.05 నిమిషాలకు విశాఖపట్నంలో బయలుదేరి..ఉదయం 7.40 నిమిషాలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. ఇదే ట్రైన్ 02870 నెంబర్ తో  ప్రతి మంగళవారం రాత్రి 9.10 నిమిషాలకు కాకుండా ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్ లో బయలుదేరి...రాత్రి 10.30 నిమిషాలకు విశాఖపట్నం చేరుతుంది. 

3 /9

విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ వీక్లీ స్పెషల్ ట్రైన్ 02851 నెంబర్ తో ఈ నెల 11 నుంచి 28వ తేదీ వరకూ ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదయం 8.20 నిమిషాలకు విశాఖపట్నంలో బయలుదేరి..సాయంత్రం 5 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరిగి ఇదే ట్రైన్ 02852 నెంబర్ తో ఉదయం 5.10 నిమిషాలకు హజ్రత్ నిజాముద్దీన్ లో బయలుదేరి..సాయంత్రం 2.15 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 

4 /9

పూరి-చెన్నై సెంట్రల్ వీక్లీ స్పెషల్ ట్రైన్ 02859 నెంబర్ తో ఈ నెల 13 నుంచి 27వ తేదీవరకూ ప్రతి ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు పూరిలో బయలుదేరి..మధ్యాహ్నం 1.55 నిమిషాలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. తిరిగి ఇదే ట్రైన్ ఈ నెల 14 నుంచి 28వ తేదీ వరకూ ప్రతి సోమవారం సాయంత్రం 4.25 నిమిషాలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి...మధ్యాహ్నం 1.45 నిమిషాలకు పూరి చేరుకుంటుంది. 

5 /9

ట్రైన్ నెంబర్ 08496 భువనేశ్వర్-రామేశ్వరం వీక్లీ ట్రైన్ ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకుండా 12.10 నిమిషాలకు బయలుదేరి..రాత్రి 10.35 నిమిషాలకు రామేశ్వరం చేరుతుంది. తిరిగి ఇదే ట్రైన్ ..08495 నెంబర్ తో ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.50 నిమషాలకు రామేశ్వరంలో బయలుదేరి..సాయంత్రం 6.10 నిమిషాలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. 

6 /9

భువనేశ్వర్-పుదుచ్చేరి వీక్లీ ట్రైన్ 02898 నెంబర్ తో ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకూ ప్రతి మంగళవారం ఉదయం 12.10 గంటలకు బయలుదేరి..మద్యాహ్నం 12.12 నిమిషాలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. తిరిగి ఇదే ట్రైన్ 02897 నెంబర్ తో ఈ నెల 16 నుంచి 30 తేదీ వరకూ ప్రతి బుధవారం సాయంత్రం 4.45కు పుదుచ్చేరిలో బయలుదేరి..సాయంత్రం 6.10 నిమిషాలకు చేరుతుంది. 

7 /9

భువనేశ్వర్-బెంగుళూరు వీక్లీ ట్రైన్ నెంబర్ 02845 ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకూ ప్రతి ఆదివారం ఉదయం 7.30 నిమిషాలకు భువనేశ్వర్ లో బయలుదేరుతుంది. అదే ట్రైన్ ..02846 నెంబర్ తో ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకూ ప్రతి మంగళవారం ఉదయం 8.25 నిమిషాలకు కాకుండా సాయంత్రం 4.45 నిమిషాలకు బెంగుళూురులో బయలుదేరి..ఉదయం 6.15 నిమిషాలకు చేరుతుంది. 

8 /9

ఇక ట్రైన్ నెంబర్ 02839 భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు కాకుండా 12 గంటల 10 నిమిషాలకు భువనేశ్వర్లో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్ కు ఉదయం 8.55 నిమిషాలకు కాకుండా 7.40 కే చేరుతుంది. తిరుపు ప్రయాణంలో మాత్రం ఇదే రైలు ఈ నెల 18 నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 9.10 నిమిషాలకు బదులు..రాత్రి 10 గంటలకు బయలుదేరి..సాయంత్రం 5.55 నిమిషాలకు చేరుతుంది.

9 /9

నెంబర్ 08479 భువనేశ్వర్-తిరుపతి వీక్లీ ట్రైన్ టైమింగ్స్ ఈ నెల 12 నుంచి 26 వ తేదీ వరకూ ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కాకుండా 12 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుంది. తిరుపతికి ఉదయం 8.45 గంటలకు బదులు..8.10 నిమిషాలకు చేరుతుంది. అదే ట్రైన్ 08480 నెంబర్ తో ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం మధ్యాహ్నం తిరుపతి నుంచి 12.15 గంటలకు కాకుండా..ఉదయం 10.25 గంటలకు బయలు దేరి..భువనేశ్వర్ కు ఉదయం 5.55 గంటలకే చేరుతుంది.