Budget 2024 Halwa Ceremony: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
Budget 2024 Halwa Ceremony: మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్ కు ప్రక్రియ సిద్ధమైంది.
Budget 2024 Halwa Ceremony: బడ్జెట్ తయారీలో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ హల్వా వండి అందరికీ పంచిపెట్టారు.
Budget 2024 Halwa Ceremony: బడ్జెట్ తయారీ సందర్భంగా హల్వా చేయడం ఆనవాయితీగా వస్తోంది.
Budget 2024 Halwa Ceremony: ఏదైనా శుభకార్యం.. గొప్ప పని ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకుని ప్రారంభించడం భారతీయుల అలవాటు. అదే ఉద్దేశంతో దేశానికి సంబంధించిన కీలకమైన బడ్జెట్ రూపకల్పన చేస్తుండడంతో హల్వా వండి బడ్జెట్ పనులు ప్రారంభిస్తారు.
Budget 2024 Halwa Ceremony: హల్వా వేడుక తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మొదలు.. ఆర్థిక శాఖ ఉద్యోగులందరూ పూర్తిగా బడ్జెట్ తయారీలో నిమగ్నమవుతారు.
Budget 2024 Halwa Ceremony: నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై ప్రజలు భారీ ఆశలు ఉంచుకున్నారు. మరి వారి ఆశలు తీరనున్నాయా లేదా? అనేది జూలై 23వ తేదీన తెలియనుంది.