Pregnancy Parenting Tips: ప్రతి తండ్రి తన కూతురుకు నేర్పించాల్సిన విషయాలివే..


Pregnancy Parenting Tips: పిల్లలను పెంచడం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు..వారిలో మంచి విలువలను కూడా పెంపొందించడం ముఖ్యమైన కర్తవ్యం. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారిలో నైతిక విలువలు, ఆదర్శ విలువలను నేర్పించడం ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం. సమాజంలో ఆడపిల్లలను ఉన్నతశిఖరాలకు చేరుకునేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషించేది కన్నతండ్రి. ప్రతి తండ్రి తన కూతురుకు నేర్పించాల్సిన విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /8

Pregnancy Parenting Tips: ఆడపిల్ల అనగానే సంఘంలో వివక్ష ఇంకా ఉంది. ఆడపిల్లలకు, మగపిల్లల మధ్య లింగవ్యత్యాసం చూపించేవాళ్లు ఉన్నారు. ఆడపిల్ల అనగానే తల్లిదే బాధ్యత అనుకుంటారు. కానీ ఆడపిల్లలను పెంచడంలో తండ్రిదే కీలక బాధ్యత. అవును సంఘంలో ఆడపిల్ల నైతిక విలువలు, ఆదర్శభావాలను తండ్రి నేర్పించాలి.   

2 /8

మన స్వభావం, ప్రవర్తన బాగుంటే సమాజంలో గౌరవానికి లోటుండదు. ఈ విలువలను మనం చిన్నప్పటి నుండే నేర్చుకోవాలి. ఇంట్లో పిల్లలు పుడితే తల్లిదండ్రులకు బాధ్యత పెరుగుతుంది. ఆడపిల్ల పుడితే తండ్రి కర్తవ్యం రెట్టింపు అవుతుందని అంటారు. ఆడపిల్లలు ఎదుగుతున్న దశలో తండ్రి తన కూతురుకు నేర్పించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 

3 /8

తండ్రి  తన కుమార్తెలకు సమాజంలో ఎలా జీవించాలో అన్ని విషయాల గురించి ఏ దశలో తెలియజేయాలి. నేటి అనూహ్యమైన సమాజంలో కష్టతరమైన జీవిత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి వంటి అనేక విషయాలను తండ్రి తన కుమార్తెకు తెలియజేయాలి.

4 /8

ప్రతి తండ్రి తన కూతురికి తనను తాను ఇష్టపడాలని చెప్పాలి. ముందు ఆమె విలువ ఏమిటో అర్థం చేసుకోవాలి. సమాజ ప్రమాణాలు ఆమె విలువను నిర్ణయించలేవని చెప్పాలి. ఇతరులను గౌరవించే ముందు తనను తాను గౌరవించుకోవడం నేర్చుకోవాలి. 

5 /8

బలమైన వ్యక్తిగా మారడానికి నిజాయితీ చాలా ముఖ్యమని తండ్రి తన కుమార్తెకు చెప్పాలి. మీరు ఎల్లప్పుడూ సత్యం కోసం నిలబడితే, మీరు సమాజంలో విశ్వాసం  గౌరవాన్ని పొందవచ్చు. ఇలా కుమార్తె సమాజంలో ఎలా జీవించాలో తెలుస్తుంది . ఆమె మానసిక ఆందోళన దూరమవుతుంది.  

6 /8

సమాజంలో జీవించడానికి, ఆమె తన చుట్టూ ఉన్న వ్యక్తులతో ప్రేమ, గౌరవంతో వ్యవహరించాలని.. ఇతరుల పట్ల కరుణ, శ్రద్ధ కలిగి ఉండాలని కూడా మీ కుమార్తెకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. సమాజాన్ని మంచి మార్గంలో చూసేందుకు ఆమెకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే ఆమె సమాజంలోని వివిధ కోణాలను సులభంగా ఎదుర్కోగలదు.

7 /8

జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. తల్లిదండ్రులు ఇప్పటికే అనుభవించే ఉంటారు. తండ్రి తన అనుభవాల నుంచి ఉదాహరణల రూపంలో తన కుమార్తెకు ఈ ఆలోచన వారిలో వచ్చేలా చేయాలి. అన్ని విషయాల్లోనూ మనదే కాదు, నష్టపోయేది కూడా మనదే. ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదని , గెలిచినప్పుడు పొంగిపోకూడదని తండ్రి తన కూతురికి నేర్పించడం తప్పనిసరి. మీ కుమార్తెకు అన్ని వేళలా ఒకేలా ఉండటం అలవాటు చేసుకునేందుకు వీలుంటుంది.  

8 /8

ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పని పట్ల శ్రద్ధ వహించాలి. ఇది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. ఆడపిల్లలకు చిన్నతనంలోనే ఆర్థిక స్వాతంత్ర్యం గురించి నేర్పించాలి. ఇది ఆమె మేధావిగా మారడానికి సహాయపడుతుంది. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమూ.. దానిని తదుపరి జీవితంలో ఎలా పొదుపు చేయాలో ఆమెకు చెప్పండి.