One Nation One Gold Rate : వన్ నేషన్, వన్ గోల్డ్ రేట్..అమలుకు వేగంగా అడుగులు

One Nation One Gold Rate : ఇకపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు ఒకేవిధంగా ఉండేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ ను త్వరలోనే తీసుకురానున్నారు. 
 

1 /7

One Nation One Gold Rate :  మనదేశంలో ప్రతి రాష్ట్రంలో , ప్రతి ప్రధాన నగరంలో బంగారం ధరలు చాలా భిన్నంగా ఉంటాయి. రాష్ట్రాల పన్ను రేటుతోపాటు అనేక ఇతర విషయాలు బంగారం ధరతో ముడిపడి ఉంటుంది. బంగారంపై వన్ నేషన్ వన్ రేట్ పాలసీ త్వరలోనే అమల్లోకి రానుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

2 /7

ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత బంగారం ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటాయి. ఏ రాష్ట్రంలోకి వెళ్లినా ఒకే విధంగా ఉంటాయి. ఈ విధానానికి జెమ్ అండ్ జ్యువెల్లరి కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది.   

3 /7

ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ అనేది మన దేశంలో రత్నాలు, ఆభరణాల వాణిజ్యాన్ని ప్రోత్సహించే జాతీయ వాణిజ్య సమాఖ్య. ఇది వాణిజ్య పద్ధతులు, వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రణాళికలను రూపొందిస్తుంది. తాజాగా జెమ్ అండ్ జువెల్లరీ వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ విధానానికి అంగీకరించింది 

4 /7

దేశవ్యాప్తంగా ఒకే రకమైన బంగారం ధరలను అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్కీము ఇది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ మూలన అయినా సరే ఒకే ధరకు బంగారాన్ని కొనుగోలు చేసి అమ్ముతుంటారు. 

5 /7

ప్రభుత్వం నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ను ఏర్పాటు చేయనుంది. బంగారం ధరను ఈ ఎక్స్చేంజ్ ద్వారానే నిర్ణయిస్తారు. దీనిద్వారా నగర వ్యాపారులు నిర్ణీత ధరకు గోల్డ్ ను విక్రయిస్తుంటారు. ఈ విధానం అమలుతో మార్కెట్ లో పారదర్శకత పెరుగుతుంది.

6 /7

బంగారం ధరల్లో వ్యత్యాసం తగ్గడంతో దాని ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో పాటు బంగారంపై ఇష్టానుసారంగా ధరలు వసూలు చేసే ధోరణికి అడ్డకట్ట పడుతుంది. 

7 /7

ఈ పాలసీ కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకే ధరకు బంగారం ఉండటం వల్ల వినియోగదారులందరికీ ఒకే ధరకు ఆభరణాలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండటం వల్ల బంగారం మార్కెట్ మరింత మెరుగ్గా ఉంటుంది. దీనికి తోడు రాష్ట్రాల్లో వేరువేరు ధరల కలయిక కారణంగా బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉంటుంది.