Oneplus 11R Vs Oneplus 11: వన్‌ప్లస్‌ ఈ మొబైల్స్‌ కొనేవారు 8 తేడాలు తప్పకుండా తెలుసుకోండి..

Oneplus 11R Vs Oneplus 11: వన్‌ప్లస్‌తో ఈ రెండు మొబైల్స్‌ కొనుగోలు చేసేవారు తప్పకుండా వీటి రెండింటి మధ్య ఉన్న తేడాలు తెలుసుకోండి. అంతేకాకుండా ఈ రెండింటిలో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా ఏది బెస్టో తప్పకుండా తెలుసుకుని కొనుగోలు చేయండి. 


Oneplus 11R 5G Vs Oneplus 11 5G: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో వన్‌ప్లస్ 11 5g, వన్‌ప్లస్ 11r మొబైల్స్ విక్రయాల్లో ముందున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ప్రీమియం ధరల్లో శక్తివంతమైన ఫీచర్స్ కలిగి ఉండడం వల్ల యువత ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ మొబైల్ చాలా బెస్తో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

1 /8

వన్ ప్లస్ 11 5G ధర 56,999 నుంచి ప్రారంభం అవుతుంది. వన్ ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.39,999 నుంచి మొదలవుతుంది. ధర పరంగా ఈ రెండింటిలో వన్ ప్లస్ 11R 5G మొబైల్‌ చాలా బెస్ట్‌గా భావింవచ్చు.

2 /8

వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల LTPO 3.0 QHD+ AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. దీన్ని స్క్రీన్k 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ 11R 5G లో 6.74-అంగుళాల AMOLED డిస్ప్లే తో అందుబాటులోకి వచ్చింది. ఇది120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తోంది.  

3 /8

OnePlus 11 5G మొబైల్‌లో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

4 /8

వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లలో లభిస్తోంది. వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లలో అందుబాటులో ఉంది.

5 /8

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ బ్యాక్ సెటప్‌లో 50MP + 48MP + 32MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో లభిస్తోంది. OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉంది.

6 /8

వన్ ప్లస్ 11 5G మొబైల్ 5000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్‌తో మార్కెట్‌లో లాంచ్‌ అయ్యింది. OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ చార్జింగ్‌తో లభిస్తోంది.

7 /8

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ 11R 5G 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.  

8 /8

అత్యుత్తమమైన డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరాను కావాలనుకునే వారికి OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ చాలా బెస్ట్, ఇక మిడ్-రేంజ్ ధర, ఫీచర్లు కావాలనుకునేవారు OnePlus 11R మొబైల్ మంచి ఎంపికగా భావించవచ్చు.