Parivartini Ekadashi 2024: పనులు ఆగిపోయి నిరాశలో ఉన్నారా.. అయితే సెప్టెంబర్ 14న పరివర్తన ఏకాదశి రోజు ఈ పూజలు చేయండి


Parivartini Ekadashi 2024: తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏడాదికి మొత్తం 24 ఏకాదశిలు ఉంటాయి. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్ల పక్షం అయితే..రెండవది కృష్ణ పక్షం. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంటుంది. భాద్రపదమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీ శనివారం వచ్చింది. ఇప్పుడు పరివర్తన ఏకాదశి పూజ ఏవిధంగా చేయాలి. పూజ ఫలితం ఎలా ఉంటుందనే విషయాలు తెలుకుందాం. 
 

1 /4

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శేషశయ్యై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు..భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు ఎడమ వైపు నుంచి కుడివైపునకు ఒత్తిగిల్లుతాడని పురాణాలు చెబుతున్నాయి. అలా స్వామి ఒక వైపు నుంచి మరోవైపునకు పరివర్తనం చెందే ఏకాదశి కాబట్టి దీనిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు శయన భంగిమలో ఒక వైపు నుంచి మరోవైపునకు తిరుగుతాడు. కాబట్టి దీనిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తారు.   

2 /4

ఈ ఏడాది పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ 14( శనివారం) రోజు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది పరివర్తన ఏకాదశి శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య పూజ చేయడం శ్రేయస్కారమని పండితులు అంటున్నారు.   

3 /4

మిగతా ఏకాదశుల వలే పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్ష చేడతారు.  సూర్యోదయంతోనే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శ్రీ లక్ష్మీ నారాయణస్వామిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించాలి. చేమంతి పువ్వులో ఆ విష్ణుమూర్తిని అలంకరించి పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నైవేద్యంగా నివేదించాలి. ఇక ఈ పూజ చేసే వారు రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం దీపారాధన చేసిన విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ రోజు విష్ణు పారాయణం చేస్తే కోటిరెట్లు అధిక ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇక ఆరోజు రాత్రంతా జాగరణ చేయాలి.   

4 /4

ఈ విధంగా వ్రతం పూర్తి చేస్తే పలు రకాల కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. పరివర్తన అంటే మార్పు. అందుకే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటూ శ్రీలక్ష్మీ నారాయణులను భక్తితో పూజిస్తే జీవితంలో గొప్ప మార్పులు ఉంటాయని విశ్వసిస్తుంటారు. తెలిసితెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. కోరిన కోరికలు ఫలితాయని నమ్ముతుంటారు.