Pavan Tej Konidela: హీరోయిన్ తో ఏడడుగులు వేయనున్న మెగా హీరో .. ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా?

కొణిదెల కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్, తరువాత ఆచార్య సినిమాలో కూడా ఒక చిన్నపత్రలో కనిపించాడు. తాజాగా అయన హీరోయిన్ మేఘనతో నిశ్చితార్ధం చేసుకున్నారు.  

  • Aug 12, 2022, 13:48 PM IST

Pavan Tej Konidela Engaged to Actress Meghana: కొణిదెల కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్, తరువాత ఆచార్య సినిమాలో కూడా ఒక చిన్నపత్రలో కనిపించాడు. తాజాగా అయన హీరోయిన్ మేఘనతో నిశ్చితార్ధం చేసుకున్నారు.  
 

1 /5

తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ కి మెగాస్టార్ సతీమని కొణిదెల సురేఖ సహా బుల్లితెర ప్రముఖులు కొంత మంది కూడా హాజరయ్యారు.  

2 /5

కొణిదెల ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో పవన్ తేజ్ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవికి దూరపు బంధువు ఆయన పవన్ తేజ్ తెలుగులో ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.

3 /5

ఈ సినిమాలోనే మేఘన హీరోయిన్ గా నటించింది. తర్వాత ఆమెకు హీరోయిన్గా అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర యాంకర్ గా ప్రస్తుతం పలు షోస్ లో యాంకరింగ్ చేస్తోంది.

4 /5

పవన్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇటీవల ఆచార్య సినిమాలో మెగాస్టార్ తో ఒక ఫైట్ లో కూడా కనిపించాడు. హీరోగా మరిన్ని సినిమాలు చేసేందుకు పవన్ తేజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

5 /5

వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు యాంకర్ సుమ, రాజీవ్ కనకాల, సాయి ధరంతేజ్ సహా పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి నటించిన ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ చిగురించడంతో దాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లిగా మలుచుకున్నారు.