Kriti Kharbanda: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Kriti Kharbanda‌ Engagement Photos:
పవన్ కళ్యాణ్‌ తీన్మార్ సినిమాతో మనందరికీ పరిచయమైన హీరోయిన్ కృతి కర్బంద. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  • Jan 30, 2024, 17:05 PM IST
1 /6

Kriti Kharbanda‌ Engagement Photos: తెలుగులో పద్దతిగా కనిపించిన ముద్దుగుమ్మల్లో కృతి కర్బంద కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమా తీన్మార్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

2 /6

ఆ తరువాత మనోజ్ హీరోగా చేసిన మిస్టర్ నూకయ్య, రామ్ హీరోగా చేసిన ఒంగోలు గిత్త లాంటి సినిమాలలో డీసెంట్ రోల్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

3 /6

ఈ హీరోయిన్ కి తెలుగులో అనుకున్న స్థాయిలో ఆఫర్లు అయితే రాలేదు. కాగా ఆ తరువాత హిందీ ఆఫర్లు అందుకోవటంతో తన దృష్టి బాలీవుడ్ వైపు తిప్పింది.

4 /6

ప్రస్తుతం ఈ ఢిల్లీ బ్యూటీ.. తన ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి అందరిని అలరిచ్చింది. గత కొంతకాలంగా పుల్కిత్ సామ్రాట్‌తో కృతి కర్బంద ప్రేమలో ఉందనే వార్త వినిపిస్తూ వచ్చింది.

5 /6

దానికి తగ్గట్టు వీరిద్దరి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ వచ్చాయి. కాగా ఇప్పుడు వారిద్దరి ప్రేమని అఫీషియల్ గా బయట పెట్టింది ఈ హీరోయిన్.

6 /6

వీరిద్దరూ ఎంగేజ్మెంట్ తో ఒకటి కాగా ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు వీరే ది వెడ్డింగ్, పాగల్ పంతీ, తైష్ వంటి సినిమాల్లో కలిసి నటించారు.