Special Scheme For Women: ప్రతి ప్రభుత్వం మహిళలను సాధికారతను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో చాలా పథకాలు మహిళలకు ఎంతో భరోసాను అందిస్తున్నాయి. దీంతో పాటు వారికి ఈ పథకాలు స్వయంప్రతిపత్తి భావనను కూడా పెంపొందిస్తున్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన పథకాన్నే మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాం. అదేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్ర మహిళలకు అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో ఒడిశా ప్రభుత్వ ఏర్పాటు చేసిన సుభద్ర యోజన పథకం ద్వారా లక్షలాది మంది మహిళలను ఆర్థిక భరోసా లభిస్తోంది.
ఇటీవలే ఒడిశా ప్రభుత్వం సుభద్ర యోజన పథకం దరఖాస్తు ప్రక్రియలో అనేక మార్పులు తీసుకు వచ్చింది. పత్రాలను డిజిటల్ ఫార్మాట్లోకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని మూలల్లోకి చేరేలా చేసిన ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలిపారు.
ఈ సుభద్ర యోజన పథకం కింద ప్రతి ఒక్క మహిళ నేరుగా రూ. 5,000 ఆర్థిక సాయం పొందుతోంది. దీనిని ఒడిశా రాష్ట్ర సర్కార్ మహిళల ఖాతాల్లోకే నేరుగా ఆర్థిక సాయాన్ని జమ చేస్తోంది. దీనిని కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు మాత్రమే అందిస్తున్నట్లు తెలుస్తోంది.
సుభద్ర యోజన పథకాన్ని సులభంగా ఆన్లైన్ దరఖాస్తును అప్లై చేసుకోవచ్చు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న subhadra.odisha.gov.in. అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు.
సుభద్ర యోజన పథకంలో భాగంగా మొదటి విడత ఆర్థిక సాయం పొందలేని మహిళలు సులభంగా నాల్గవ విడతలతో పొందవచ్చు. అంతేకాకుండా జనవరి మొదటి వారంలో ఈ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి ఇంతలోపే ఈ పథకాన్ని అప్లై చేసుకుని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.