Petrol price: పెట్రోల్ , డీజిల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి రోజూ ఎంతో కొంత పెరుగుదల కన్పిస్తూనే ఉంది. రాజస్థాన్‌లో అత్యధికంగా పెట్రోల్ ధర లీటర్ 95.50 రూపాయలుండగా..డీజిల్ ధర 87.46 రూపాయలుంది. ఈ నేపధ్యంలో నీళ్ల ధర కంటే పెట్రోల్ ధర తక్కువగా ఉండే దేశాలున్నాయంటే ఆశ్చర్యంగా ఉందా..
పొరుగుదేశాలతో పోలిస్తే భారత్‌లో పెట్రోల్ ధర అన్నింటికంటే ఎక్కువగా ఉంది. పొరుగుదేశాల్లో చైనాలో లీటర్ పెట్రోల్ ధర 72.62 కాగా..నేపాల్‌లో 67.41 రూపాయలుంది. అటు ఆప్ఘనిస్తాన్‌లో 36.34 రూపాయలు కాగా..బర్మాలో 43.53 రూపాయలుంది. పాకిస్తాన్‌లో 48.19 రూపాయలు కాగా..భూటాన్‌లో 49.56 రూపాయలు కాగా..శ్రీలంకలో 62.79 రూపాయలైతే ఇండియాలో మాత్రం అన్నింటికంటే అత్యధికంగా 95 రూపాయలుగా ఉంది.
పెట్రోల్ అత్యంత ఖరీదుగా ఉన్న విషయం గురించి మాట్లాడుకుంటే..హాంకాంగ్‌లో లీటర్ పెట్రల్ 169.21 రూపాయలు కాగా..సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్‌లో 150.29 రూపాయలుంది. సిరియాలో 149.08 పైసలైతే..నెదర్లాండ్‌లో 140.90 రూపాయలుంది. నార్వేలో 135.38 రూపాయలు కాగా..ఫిన్లాండ్‌లో 133.90 రూపాయలుంది. ఇంగ్లాండ్‌లో పెట్రోల్ 116 రూపాయలు కాగా..స్విట్జర్లాండ్‌లో 115 రూపాయలుంది. జర్మనీలో 116 రూపాయలైతే..జపాన్‌లో 93.62 రూపాయలుంది. ఆస్ట్రేలియాలో 68.91 రూపాయలు కాగా..అమెరికాలో 50.13 రూపాయలుంది. రష్యాలో 42.69 రూపాయలు పలుకుతోంది.
అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటర్ నీళ్ల బాటిల్ కంటే తక్కువే ఉందంటే నమ్మశక్యంగా లేదు కదా..కానీ నిజం అది. ప్రపంచంలో వెనిజులా, ఇరాన్, అంగోలా దేశాల్లో పెట్రోల్ ధర 20 రూపాయల కంటే తక్కువే. వెనిజులాలో పెట్రోల్ ధర జనవరి 4వ తేదీన 1 రూపాయి 46 పైసలు మాత్రమే ఉంది. అటు ఇరాన్‌లో పెట్రోల్ ధర కేవలం 4 రూపాయల 24 పైసలు మాత్రమే. అంగోలాలో లీటర్ పెట్రోల్ ధర 17 రూపాయల 88 పైసలు..