Petrol Pump Scam: పెట్రోల్ బంక్‌లో ఈ స్కామ్ గురించి తెలుసా.. జీరో నుంచి అనుకుంటే పెద్ద బొక్కే..!

Petrol Pump Frauds: పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి బండి ఆపగానే.. పెట్రోల్ వేసే ముందు సార్ జీరో ఉంది చెక్ చేసుకోండి.. అని ఇంధన రీఫిల్లింగ్ మెషిన్ ఆపరేటర్ చెప్పడం కామన్. మనం జీరో చెక్ చేసుకుని పెట్రోల్ వేయించుకుని అంతా పర్ఫెక్ట్‌గా ఉందని అనుకుంటాం. అయితే జీరో ఉన్నా.. జంప్ ట్రిక్‌తో చాలా పెట్రోల్ బంక్ మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. 
 

1 /5

పెట్రోలు బంక్ యజమానులు మెషీన్‌ రీడింగ్‌లను ట్యాంపరింగ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.  

2 /5

జంప్ ట్రిక్ అంటే.. కొన్ని పెట్రోల్ బంక్‌లు కస్టమర్లు ఇచ్చిన డబ్బులు కంటే తక్కువ ఇంధనాన్ని పోస్తున్నాయి.   

3 /5

అంటే జీరో నుంచి స్టార్ట్ చేసినా.. పెట్రోల్ పంప్ మీటర్ క్రమంగా 0 నుంచి 10, 20 ఇలా ఒకేసారి దూసుకుపోతుంది.  

4 /5

సాధారణంగా పెట్రోల్ పోస్తున్న సమయంలో మీటర్ రీడింగ్ రూ.4 నుంచి రూ.5లోపు మాత్రమే ఉండాలి. కానీ ఒకేసారి రూ.10 లేదా రూ.20 కంటే ఎక్కువ రీడింగ్‌లో జంప్ ఉంటే ఫౌల్ ప్లేకి సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.  

5 /5

మీరు పెట్రోల్ బంక్‌లోకి వెళ్లగానే వేరే ధ్యాసలో ఉంటూ రీడింగ్‌ను మర్చిపోకండి. ఫుల్ పెట్రోల్ పోసే వరకు రీడింగ్‌ కన్నేసి ఉంచండి. ఏదైనా అనుమానం కలిగినా పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించండి.