Photo Gallery: శిఖర్ ధావన్ లాగా.. విడాకులు తీసుకున్న భారత క్రికెటర్లు... ఎవరో చూడండి..??

  • Sep 08, 2021, 15:22 PM IST

ఎవరైనా ప్రేమిస్తే.. ఆ యువతి లేదా యువకుడు వారి ప్రేమను అంగీకరిస్తే ఎంత ఆనందం ఉంటుందో.. ప్రేమించి పెళ్లి లేదా పెళ్లి చేసుకొని ప్రేమించాక విడిపోతే ఆ బాధ మాములుగా ఉండదు కదా..! అలాంటి పరిస్థితే మన టీమిండియా లెజెండరీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ జంటది కూడా. ఒక్క శిఖర్ ధావన్ మాత్రమే కాదు... ఇంకొన్ని టీమిండియా జంటలు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు.. వాళ్ళెవరో చుసేద్దామా మరీ!
 

1 /5

టీమిండియా లెజెండరీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) 2012 లో అయేషా ముఖర్జీని (Ayesha Mukherjee)వివాహం చేసుకున్నాడు. అయేషాకు ఇది వరకే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  ధావన్ కంటే అయేషా వయసులో 10 సంవత్సరాలు పెద్దదైనప్పటికీ ఇప్పటి వరకు ఇద్దరు సంతోషంగా ఉన్నారు. అయితే అయేషా ముఖర్జీ తన భర్త శిఖర్ ధావన్ నుండి విడాకులు తీసుకున్నామని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఇదిలా ఉంటే... ఇప్పటి వరకు శిఖర్ ధావన్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవటం గమనార్హం. 

2 /5

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ (Indian opening batsman Murali Vijay) నికితా వంజారాను (Nikita Vanzara) వివాహం చేసుకున్నాడు. మొదటగా నికిత టీమ్ ఇండియా ప్లేయర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) మొదటి భార్య, కానీ కార్తీక్ తో విడాకులు తీసుకొని, మురళీ విజయ్ ని పెళ్లి చేసుకుంది. ఈ విషయంపై  దేశ ప్రజలు ఈ ఇద్దరి ఆటగాళ్ల గురించి చాలా సార్లు హేళన చేసారు.   

3 /5

టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Team India fast bowler Mohammed Shami) విడాకుల తీసుకున్న క్రికెటర్ జాబితాలో ఉన్నాడు.  షమీ 2014 లో హసిన్ జహాన్‌ను (Hasin Jahan) వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మనస్పర్దాల కారణంగా వేరు వేరుగా ఉంటున్నారు. నిజానికి హసిన్ జహాన్‌ ఇది వరకే వివాహం అవగా.. షమీని రెండో పెళ్లి చేసుకుంది.   

4 /5

భారత లెగ్ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే (Veteran Indian leg spin bowler Anil Kumble) భార్య  చేత్నా కూడా తన మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. తర్వాత అనిల్ కుంబ్లే చేత్నాను (Chetna) 1999 వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట చాలా కాలంగా కలిసి సంతోషంగా ఉంటున్నారు.

5 /5

మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ (Former fast bowler Venkatesh Prasad) కూడా విడాకులు తీసుకున్న మహిళను వివాహం చేసుకున్నాడు.వెంకటేశ్ ప్రసాద్ మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న జయంతి (Jayanti) అనే మహిళను  1996 లో వివాహం చేసుకున్నాడు.