PM Kisan Big Update: పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకునే రైతులకు బిగ్ అలెర్ట్. ముందుగానే మీరు ఓ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 లోగా ఈ పనిచేయకపోతే మీకు 19వ విడుత పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావు. దీనికి రైతులు ఏం చేయాలి? ఇ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పీఎం కిసాన్ రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాంరంభించిన పథకం. ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులు ప్రతి ఏడాది రూ.6000 పొందుతారు. ప్రతి ఏడాది మూడు విడుతల్లో రూ.2000 చొప్పున జమ చేస్తారు.
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడుతలు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు రైతులు అందరూ 19వ విడుత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ 19వ విడుత డబ్బులు 2025 ఫిబ్రవరి నెలలో క్రెడిట్ అవుతాయని తెలుస్తోంది. అయితే, ఈ డబ్బులు పొందాలంటే రైతులు ముందుగానే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైనలో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ యాక్టీవ్‌గా ఉండాలి.
ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఈ ప్రక్రియ మొత్తం డిసెంబర్ 31లోగా పూర్తి చేసుకోవాలి. మీ భూరికార్డులు కూడా సరిగ్గా ఉండాలి. కేవలం అప్పుడ మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు పొందడానికి మీరు అర్హులు అవుతారు. ఇక ఆన్‌లైన్ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి దరఖాస్తు చేసుకునే వారు Pmkisan.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోనే కేవైసీ, బెనిఫిషియారీ స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా కల్పించారు. వెంటనే మీరు కూడా తగిన ధ్రువపత్రాలతో పీఎం కిసాన్ యోజనకు వెంటనే అప్లై చేసుకోండి.