Independence day 2024: ప్రధాని మోదీ మరో అరుదైన ఘనతను సాధించబోతున్నారు. ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
మనదేశానికి మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా.. ఆయన అనేక రికార్డులను సైతం క్రియేట్ చేస్తున్నారు. అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ మరోసారి మోదీ తన చరిష్మాతో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా.. 78 వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు మన దేశం రెడీ అవుతుంది. ఈక్రమంలో ప్రతి ఊరు, వాడలో కూడా జాతీయజెండాను ఎగరవేస్తారు. దేశప్రధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయజెండాను ఎగర వేస్తారు. ఈసారి మోదీ మూడో సారి పీఎంగా బాధ్యతలు స్వీకరించి అరుదైన ఘనత సాధించారు.
అంతేకాకుండా.. ఆయన ఇప్పటి వరకు 10 మార్లు గతంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీని ఉద్దేషించి ప్రసంగించారు. తాజాగా, మూడోసారి పీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మరల ఆగస్టు 15 న ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జాతీని ఉద్దేషించి ప్రసంగిస్తారు.
దీంతో ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టనున్నారు. అంతేకాకుండా.. వరుసగా మూడుమార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రు రికార్డును సైతం ఇప్పటికే సమం చేశారు.
ఇప్పటి వరకు 11 సార్లు ఎర్రకోటపై జెండా ఎగరవేసి, ప్రసంగించినప్రధానుల్లో.. నెహ్రు, ఇందిరా గాంధీ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోదీ వారిసరసన నిలవనున్నారు. నెహ్రు 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు ఎర్రకోటపై ప్రసంగించారు.
అదే విధంగా మోదీ.. గతంలో తన ప్రసంగ పాఠవం దాదాపుగా 82 నిమిషాలుగా ఉంది. ఇది 2017 లో.. కేవలం 55 నిముషాలు ఉండగా.. 2016 లో 94 నిమిషాలుగా ఉంది.ఇండిపెండెన్స్ డే సమయంలో.. నెహ్రు కేవలం 24 నిముషాలు మాత్రమే ప్రసంగించారంట.