PMV Electric Car: నానో కంటే చిన్నదైన బుల్లి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది, ధర ఎంతో తెలుసా

ఇప్పుడంతా ఎలక్ట్రిక్ కార్ల శకం ప్రారంభం కానుంది. నానో కారు లాంటిదే ఇప్పుడు బుల్లి ఎలక్ట్రిక్ కారును ముంబైకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ లాంచ్ చేసింది. అత్యంత చౌకగా లభిస్తున్న అతి బుల్లి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ కారు ఇతర వివరాలు తెలుసుకుందాం..

PMV Electric Car: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ కార్ల శకం ప్రారంభం కానుంది. నానో కారు లాంటిదే ఇప్పుడు బుల్లి ఎలక్ట్రిక్ కారును ముంబైకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ లాంచ్ చేసింది. అత్యంత చౌకగా లభిస్తున్న అతి బుల్లి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ కారు ఇతర వివరాలు తెలుసుకుందాం..

1 /6

ఇక PMV లుక్ గురించి చెప్పుకుంటే..ఈ కారులో హెడ్‌ల్యాంప్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో ఒక ఎల్ఈడీ లైట్ బార్ ఉంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్లు కాగా, ఈ కారు బరువు 550 కిలోలుంది. 

2 /6

ఇందులో ఒక డిజిటల్ ఎన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎయిర్ కండీషనింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్టెన్స్, క్రూజ్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఆన్‌బోర్డ్ నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ యాక్సెస్, స్మార్ట్‌ఫోన్ కనెక్షన్ ఉన్నాయి.

3 /6

కారుతో పాటు 3కిలోవాట్ ఏసీ ఛార్జర్ కూడా ఉంది. ఈ కారు మోటార్ 13 హెచ్‌పి కాగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 5 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

4 /6

PMV Electric EaS-E ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేసేందుకు ఓ గంట సమయం పడుతుంది.

5 /6

PMV Electric EaS-E ఇండియాలో విక్రయిస్తున్న అతి చిన్న ఎలక్ట్రిక్ కారు. ఇందులో ఒకేసారి ఇద్దరు పెద్దవాళ్లు, ఒక పిల్లవాడు కూర్చోవచ్చు. పట్టాణాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ కారు డిజైన్ చేశారు. ఈ కారు పొడవు 2915 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1157 మిల్లీమీటర్లు. ఇక ఎత్తు 1600 మిల్లీమీటర్లు. అంటే మారుతి ఆల్టో కంటే చిన్నదే.

6 /6

PMV Electric EaS-E ముంబైకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ PMV Electric ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసింది. ఈ కారుకు PMV Electric EaS-E అని నామకరణం చేసింది. ఇది మైక్రోసైజ్ ఎలక్ట్రిక్ కారు. నానో కారు కంటే కాస్త చిన్నది కన్పిస్తోంది. ఇండియాలోని అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే. దీని ధర 4.79 లక్షలు. తొలి పదివేలమందికి ఈ ధర వర్తిస్తుంది. కేవలం 2000 రూపాయలతో కంపెనీ వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. లాంచ్ కంటే ముందే 6 వేల కార్లు బుక్ అయ్యాయి.