Pooja Hegde stylish pics: ఎన్నో తెలుగు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూజ హెగ్డే. ఒకప్పుడు గోల్డెన్ లగ్ గా పిలవబడిన ఈ హీరోయిన్ పరిస్థితి.. ఎప్పుడు మాత్రం అంతగా బాగోలేదు. వరుస ప్లాపులతో సతమతమవుతోంది పూజ. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం.. వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన.. హీరోయిన్ పూజా హెగ్డే. ఆమె మొదటి సినిమా పెద్ద విజయం సాధించకపోయినా …పూజకి మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక వెంటనే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందా సినిమాలో కనిపించింది ఈ హీరోయిన్.
శ్రీకాంత్ అద్దాల దర్శకత్వంలో.. వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ అయిన ముకుందా కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక కొద్ది రోజులకే రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణి పాటతో ..అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది పూజ హెగ్డే.
ఆశ్చర్యం కొద్దీ ఐటమ్ సాంగ్ తరువాత పూజకి.. తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అంతేకాకుండా అరవింద సమేత.. అలా వైకుంఠపురంలో.. లాంటి సినిమాలతో ..బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి.. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది పూజ హెగ్డే. అయితే ఈ హీరోయిన్ కి గత కొద్ది రోజుల నుంచి మాత్రం టైం పెద్దగా బాగోలేదు. ఆచార్య, రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది ఈ హీరోయిన్.
ఈ క్రమంలో పూజా హెగ్డే మళ్లీ తెలుగులో ఎప్పుడు సూపర్ హిట్ సాధిస్తుంది.. అని అందరు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. యమ స్టైలిష్ లుక్ తో అందరిని ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్.