Pooja Hegde: షాకింగ్ నిర్ణయం తీసుకున్న పూజ హెగ్డే.. రిస్క్ తీసుకోవడమే మిగిలిన ఆప్షన్..!

Pooja Hegde Movies: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెరిసిన పూజా హెగ్డే.. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ మాత్రమే అందుకుంది. ఈ నేపథ్యంలో ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. అందుకే మళ్లీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవడం కోసం పూజ హెగ్డే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

1 /5

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉండే పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో దృష్టి పెట్టకుండా స్టార్ సినిమాలో చేసిన పూజ హెగ్డే వరుసగా డిజాస్టర్లు అందుకొని.. ఇప్పుడు ఐరన్ లెగ్ గా మారిపోయింది. దీంతో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ఎక్కడైనా పేరు తెచ్చుకోవాలని ప్లాన్ చేసింది.  

2 /5

కానీ బాలీవుడ్ లో కూడా ఈమెను అదృష్టం వరించలేదు. ఈ నేపథ్యంలో ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. అసలు పూజ హెగ్డే.. కెరియర్ ఏమవుతుందో అభిమానులు కూడా కంగారు పడటం మొదలుపెట్టారు. కానీ ఈ సమయంలోనే పూజ హెగ్డే కి ఒక సినిమా ఆఫర్ అయితే వచ్చింది. కానీ అందులో ట్విస్ట్ ఉంది.

3 /5

సినిమాలో పూజ హెగ్డే ఒక పాప తల్లిగా.. కనిపిస్తుందట. సినిమాలో హీరోయిన్ అయినప్పటికీ.. ఒక పాప తల్లిగా పూజ హెగ్డే నటించాల్సి ఉంది. కానీ సినిమా డైరెక్టర్ మాత్రం ఇప్పటిదాకా..ఫ్లాప్ ఎరుగని దర్శకుడు. పైగా రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఇస్తున్నారట. అందుకే పూజా హెగ్డే ఈ సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

4 /5

పూజ హెగ్డే వయసు.. కూడా చిన్నదే. కనీసం ఆమెకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. మరి ఈ సమయంలో ఒక పాప తల్లిగా కనిపిస్తే.. ఆమె కెరియర్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. పెళ్లికి ముందే ఇలాంటి పాత్రలు చేయడం పెద్ద రిస్క్ అని చెప్పుకోవాలి.

5 /5

మరి ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్న పూజా హెగ్డే కెరియర్ ఎంతవరకు మారుతుందో వేచి చూడాలి. సినిమాలపరంగా ఎలా ఉన్నా పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే వస్తోంది. ఈ మధ్యనే వెకేషన్ కి వెళ్ళిన పూజ హెగ్డే సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.