Rashmika Mandanna: రష్మిక కి తినడం అంటే చాలా ఇష్టమట.. అయినా ఎందుకు ఫిట్ గా ఉందో తెలుసా?

Rashmika Fitness Regime: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎదిగిన.. రష్మిక మందన్న ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఎంతో అందంగా ఉండే రష్మికకి తినడం చాలా ఇష్టమట. మరి తింటూ కూడా ఆమె నాజుగ్గా.. ఎలా ఉండగలుగుతుంది అని అడగగా, ఆమె తన డైట్ చార్ట్ బయటపెట్టింది. 
 

1 /5

మనం బరువు పెరగాలి అన్నా.. తగ్గాలి అన్నా.. అందంగా కనిపించాలన్నా.. జుట్టు పెరగాలన్నా.. దేనికైనా.. అన్నిటికంటే ఎక్కువగా ప్రభావం చూపించేది మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. త్వరగా బరువు పెరిగిపోతున్నామని.. కానీ తినడం మాత్రం ఆపలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. 

2 /5

అయితే మరొకవైపు సినిమాలలో హీరోయిన్లు మాత్రం చాలా నాజూకుగా.. అందంగా కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఇష్ట ఇష్టాలు ఉండవా? నోరు కట్టేసుకుంటేనే బరువు తగ్గగలమా? అంటే నేషనల్ క్రష్..రష్మిక మందన్న మాత్రం కాదు అని నిరూపిస్తోంది. ఎంతో అందంగా ఉండే రష్మిక మందన్న పెద్ద ఫుడీ అట. మరి తినడం ఇష్టం ఉన్న రష్మిక ఫిట్ గా ఎలా ఉందో ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. 

3 /5

"షూటింగ్లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. నాకు ఇంటి భోజనం చేయడమే అలవాటు. ఉదయం నుంచి రాత్రి దాకా మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగుతూ ఉంటాను. డైటీషియన్ సలహా మేరకు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా మొదలుపెట్టాను. ఉదయం లేచాక ఐస్ కాఫీ తాగడం నాకు అలవాటు. ఆ తరువాత కాసేపటికి సెలరీ (ఆకు కూరలు) జూస్ తాగుతాను. బ్రేక్ ఫాస్ట్ లాగా ఓట్స్, బాదం బటర్ నా ఫేవరెట్" అని చెప్పుకొచ్చింది రష్మిక. 

4 /5

"లంచ్ కి కాసేపటి ముందు బ్లాక్ టీ తాగుతాను. లంచ్ లో చికెన్, బాగా మెదిపిన బంగాళదుంపలు తీసుకుంటాను. డిన్నర్ కి కూడా లైట్ గా వెజిటబుల్ సూప్, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్ తింటాను" అని తన డైట్ రివీల్ చేసేసింది రష్మిక. ఎంత తిన్నా ఫిట్ గా ఉండటం కోసం వ్యాయామం చేయడం మాత్రం మర్చిపోను అని అంటుంది రష్మిక. 

5 /5

ముఖ్యంగా కిక్ బాక్సింగ్, ఈత కొట్టడం, స్కిప్పింగ్, డాన్స్, యోగా, బ్రిస్క్ వాక్, కార్డియో వంటివి చేస్తాను అంటోంది ఈ భామ. ఇక సినిమాలపరంగా చూసినా రష్మిక చాలా బిజీగా ఉంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాలో నటిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.