Potato Chips Side Effects: అతిగా ఆలూ చిప్స్ తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో బరువు పెరడం, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తయి.
Potato Chips Side Effects: ప్రస్తుతం చాలా మందికి ఇష్టమైన స్నాక్స్‌లో ఆలూ చిప్స్ ఒకటి. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి నోటికి కరకలాడుతూ.. టేస్టీగా ఉంటాయి. అందుకే చిన్న నుంచి పెద్దవరకు వీటిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతారు. అయితే వీటిని రోజు తినడం మంచిదా? రోజు తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.
చాలా మంది స్నాక్‌గా ప్రతి రోజు అతిగా ఆలూ చిప్స్ తింటున్నారు. నిజానికి ఇలా తినడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా అతిగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఆలూ చిప్స్‌లో కేలరీలు, చెడు కొవ్వు పరిమాణాలు అతిగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా హాని కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇందులో ఉండే మూలకాలు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా పెంచుతుంది.
ఆలూ చిప్స్‌లో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఉప్పు రక్తపోటును పెంచి గుండె జబ్బులకు దారీ తీయోచ్చు. అంతేకాకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి అతిగా చిప్స్ తినడం మానుకోండి.
ఆలూ చిప్స్‌లో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి షుగర్ వ్యాధికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే మధుమేహం ఉన్నవారు చిప్స్ తినడం మానుకోండి.
రోజు అలూ చిప్స్ తినడం వల్ల కొంతమందిలో జీర్ణక్రియ సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలకు కూడా తలెత్తుతాయి.
ఆలూ చిప్స్‌లో పోషక విలువలు చాలా తక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి అతిగా ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు లభించవు. దీని కారణంగా పోషకలోపం వంటి సమస్యలు కూడా రావచ్చు.