Smita Sabharwal: తెలుగు స్టేట్స్ లలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా లేడీ డైనమిక్ అధికారిణిలు గురించి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తొంది. స్మిత సబర్వాల్, ఆమ్రపాలీ కాట గతంలో తెలంగాణలో కీలక శాఖల్లో పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమ్రపాలీ కాట ఏపీకికి బదిలీ అయిన విషయం తెలిసిందే.
తెలుగు స్టేట్స్ లలో ప్రస్తుతం ఇద్దరు సీఎంలు ఒక రకమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు సర్కారు.. ఇటీవల ఏపీకి వెళ్లిన ఆమ్రపాలీ కాటకు టూరిజం శాఖలో ఎండీగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే
అంతే కాకుండా.. మరొవైపు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి స్మిత సబర్వాల్ కు టూరిజం శాఖలో సెక్రటెరీగా బాధ్యతలు అప్పగించారు. మరీ అనుకోకుండా జరిగిందో.. ఏంటోకానీ ఇద్దరు సీఎంలు తీసుకున్న నిర్ణయం మాత్రం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చకు దారి తీసిందని చెప్పుకొవచ్చు.
తెలంగాణలో స్మిత సబర్వాల్ మెదక్ కు కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారారు. అంతే కాకుండా. . మాజీ సీఎం కేసీఆర్ .. స్మిత సబర్వాల్ కు తన పేషీలో కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మిషన్ భగీరథ పథకంలో స్మిత చాలా డైనమిక్ గా పనిచేశారంట. అంతే కాకుండా.. హెలికాప్టర్ లలో కూడా తిరుగుతూ లోకల్ అధికారుల్ని స్మిత పరుగులు పెట్టించారంట.
స్మిత ఒక్కసారిగా ఎక్స్ లో యూపీఎస్సీలో దివ్యాంగులకు రిజర్వేషన్ లు అవసరమా.. అని పొస్ట్ పెట్టారు. అది కాస్త పెద్ద రచ్చగ మారింది. ఏకంగా ఈ వ్యవహారం హైకొర్టు వరకు కూడా వెళ్లింది. అయితే అది పక్కన పెడితే... ప్రస్తుతం రేవంత్ సర్కారు మాత్రం స్మిత కు అనుకొని విధంగా బంపర్ పొస్ట్ కేటాయించారు. స్మితకు టూరిజం శాఖలో..సెక్రెటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు.
మరొవైపు ఏపీలో కూడా ఆమ్రపాలీ కాటకు టూరిజం శాఖ ఎండీగా చంద్రబాబు సర్కారు కీలక బాధ్యతలను ఇది వరకే కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో రెండు తెలుగు స్టేట్స్ ల డైనమిక్ అధికారిణులు ఒకే శాఖలో ఉండటం ప్రస్తుతం వార్తలలొ నిలిచింది.
ఆమ్రపాలీ కాట కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ గా తన కీలకంగా వ్యవహారించారు. అంతే కాకుండా..హైదరాబాద్ లో వరదలు సంభవించినప్పుడు కూడా ఆమ్రపాలీ కాట అధికారులతొ సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకున్నారు.
అనుకొకుండా.. ఆమ్రపాలీ మరికొందరు ఏపీకి బదిలీ అయ్యారు. అయితే.. ఈ అధికారులు ఒకే శాఖలో ఉండటం, ఏపీలో మాత్రం చంద్రబాబు.. టూరిజం పరంగా డెవలప్ మెంట్ చేసి, విదేశీయుల్ని సైతం ఏపీవైపు చూసేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.
దీంతో ప్రస్తుతం ఇద్దరు డైనమిక్ అధికారిణులు ఏవిధంగా ముందుకు వెళ్తారో..అనేదానిపై సర్వత్ర చర్చ నడుస్తొంది. ఇద్దరు సీఎంలు మాత్రం ఈ విషయంలో వేసిన స్కెచ్ మాత్రం భలే మ్యాచ్ అయ్యిందని.. ఏది ఏమైన రెండు తెలుగు స్టేట్స్ లలో ప్రస్తుతం టూరిజం శాఖ దూసుకొని పొవడం పక్కా.. అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.