New Year 2025 Smart Tv Offers: అత్యంత తగ్గింపు ధరకే Dor భారతదేశపు మొట్టమొదటి వైఫై బేస్డ్ సబ్స్క్రిప్షన్ స్మార్ట్ టీవీ ఫ్లిఫ్‌కార్ట్ విక్రయిస్తోంది. కేవలం నెలకు రూ.700 చెల్లించి.. దాదాపు 24 ఓటీటీలను ఫ్రీగా పొందవచ్చు. దీనికి తోడు వైఫై కూడా ఉచితంగా లభించబోతోంది.
New Year 2025 Smart Tv Offers Check Here Full Details: ఎప్పటినుంచో చీప్ ధరకే 4కే స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ఫ్లిఫ్‌కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. న్యూ ఇయర్ హాట్ డీల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలు అతి చౌక ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల మార్కెట్లోకి విడుదలైన కొన్ని టీవీలు అయితే సగం కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏ టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ప్రముఖ దేశీయ కంపెనీ Dor ఇటీవల విడుదల చేసిన వైఫై బేస్డ్ సబ్స్క్రిప్షన్ స్మార్ట్ టీవీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యంత తగ్గింపు ధరకి లభిస్తోంది. దీనిపై అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా త్వరలోనే ఫ్లిప్కార్ట్ దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ను కూడా అందించబోతోంది.
ఇక ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది QLED Ultra HD (4K) డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన Dolby సౌండ్ క్వాలిటీతో విడుదలైంది. అలాగే ఈ స్మార్ట్ టీవీలో ఇన్బిల్ట్ గా దాదాపు 24 ఓటీటీలను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు మొట్టమొదటిసారిగా ఈ స్మార్ట్ టీవీ వైఫై బేసిడ్ సబ్స్క్రిప్షన్ తో అందుబాటులోకి వచ్చింది.
ఇక మార్కెట్లో Dor 43 అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర MRP రూ.34 వేలు కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా 69% ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.10, 799కే అందుబాటులో ఉంది. ఇక ఫ్లిఫ్‌కార్ట్ దీనిపై ఒక బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఈ టీవీని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంకుకు సంబంధించిన ఫ్లిఫ్‌కార్ట్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ పేమెంట్ చేస్తే దాదాపు 5% వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఇదే కాకుండా కొన్ని ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన సబ్రిప్షన్ వివరాల్లోకి వెళితే.. ఈ టీవీని కొనుగోలు చేసే క్రమంలో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.10 వేలు చెల్లిస్తే.. ఒక నెల వైఫై సబ్స్క్రిప్షన్ తో పాటు 24 ఓటీటీల సబ్స్క్రిప్షన్ కూడా కంపెనీ అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీలో ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.