Pragya Jaiwal: ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టుగా సాగుతున్న ప్రగ్యా జైస్వాల్ కెరీర్..

Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ కెరీర్ మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. ప్రగ్యా  కెరీర్‌లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం మళ్లీ హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.

1 /5

ప్రగ్యా జైస్వాల్.. నార్త్  భామ అయినా.. తమిళ మూవీతో 'విరాట్టు'తో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్లో  'టిటూ MBA' మూవీతో తెరంగేట్రం చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా లేకపోయింది.

2 /5

తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో టాలీవుడ్ లో లెగ్ పెట్టింది. ఇక  క్రిష్ డైరెక్షన్ లో  వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమాతో ఇక్కడ ప్రేక్షకుల మనసు దోచుకుంది.

3 /5

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అఖండ’తో బ్లాక్ బస్టర్  హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్  అయిన ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీనులకు మాత్రమే పేరు వచ్చింది. ప్రగ్యాకు పెద్దగా ఒరిగిందేమి లేదు.

4 /5

కెరీర్‌లో 'అఖండ' వంటి సూపర్ హిట్ ఉన్నా ప్రగ్యాకు ఆ తర్వాత సరైన అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ హాట్ ఫోటో షూట్ నే నమ్ముకుంది.

5 /5

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్  కాక ముందు మోడల్‌గా పనిచేసింది.  ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నటిగా  కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.