Rahu Transit 2023 To 2025: కీడు గ్రహమే 3 రాశుల వారికి మంచి చేయబోతోంది!

Rahu Transit 2023 To 2025: కీడు గ్రహంగా పరిగణించే రాహు సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే ఈ గ్రహం గత సంవత్సరంలో సంచారం చేయడం కారణంగా ఏర్పడిన ప్రభావం ఇప్పటికీ కొన్ని రాశుల వారిపై పడుతూనే ఉంది. అయితే ఈ ప్రభావంతో ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.


Rahu Transit 2023 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహాన్ని కీడు గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం జాతకంలో ఆ శుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో అనేక సమస్యలతో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. అదే ఈ రాహు గ్రహం శుభస్థానంలో ఉంటే వ్యక్తికి జీవితంలో దేనికి లోటు ఉండదు. అప్పుడప్పుడు ఈ గ్రహం సంచారం చేసిన రాశిలో తిరోగమనం కూడా చేస్తుంది. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది.

1 /7

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహం దాదాపు 18 నెలల తర్వాత ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. ఈ గ్రహం అక్టోబర్ 30 గత సంవత్సరంలో మీన రాశిలోకి సంచారం చేసింది. 

2 /7

ఈ రాహు గ్రహం మీన రాశిలో దాదాపు 18 నెలల పాటు అదే రాశిలో ఉంటుంది. అంటే మే 18 తేదీ 2025వ సంవత్సరం వరకు మీన రాశి లోనే సంచార దశలో ఉంటుంది. అయితే ఈ సంచారం వల్ల ఏర్పడిన ప్రభావం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.  

3 /7

రాహు సంచార ప్రభావం వృషభ రాశి వారిపై గత సంవత్సరంలోనే పడింది. అయితే ఈ రాశి వారికి 11వ స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి వీరికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. దీంతోపాటు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి.  

4 /7

ముఖ్యంగా భాగస్వామి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే భాగస్వామితో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తారు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయం ఎన్నో లాభాలను అందించబోతోంది.

5 /7

రాహు సంచార ప్రభావం కారణంగా మిథున రాశి వారికి కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారికి రాహు తొమ్మిదవ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అదృష్టం సహాయంతో విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా పెద్ద పనులు చేసేవారు ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది.

6 /7

మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో చిన్నచిన్న ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయం వీరికి చాలా శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి పనులు ప్రారంభించిన మంచి విజయ అవకాశాలు పొందుతారు.  

7 /7

వృశ్చిక రాశి వారికి కూడా రాహు సంచారం కారణంగా ఏర్పడిన ప్రభావం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు పొందుతారు. అలాగే బెట్టింగ్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు.