Game Changer Story Leak: తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న.. గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్లో కొన్ని డీటెయిల్స్ చూసి ప్రేక్షకులు కథ మొత్తం చెప్పేస్తున్నారు. మరోపక్క ఈ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ సినిమా కొంచెం లీక్ చెయ్యడం గమనార్హం.
ఎట్టకేలకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు చిత్ర బృందం. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఒక చిన్న ఈవెంట్ లాగా నిర్వహించారు మేకర్స్. అందులో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. సినిమా స్టోరీ రిలీజ్ చేయడంతో అందరిలో ఆసక్తి మరింత పెరిగిందని చెప్పవచ్చు.
తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న శంకర్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకి రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడా కూడా రామ్ చరణ్ కనిపించరు. ఒక పొలిటీషియన్, గవర్నమెంట్ ఉద్యోగికి మధ్య వార్.. ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఒకానొక సమయంలో నాకు పోకిరి, ఒక్కడు సినిమాలు చాలా నచ్చాయి. ఎప్పటికైనా ఇలాంటి సినిమాలు నేను కూడా చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అలాంటి తరహాలోనే మీకు ఈ సినిమా మంచి వినోదాన్ని పంచుతుంది. నా కోరిక కూడా నెరవేరింది,” అంటూ శంకర్ తెలిపారు.
ఇక అలాగే స్టోరీ గురించి చెబుతూ.. “ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా బాగా నటించాడు..ముఖ్యంగా క్యారెక్టర్ కి చాలా చక్కగా సహకరించారు. ఇక అంజలి గారి విషయానికి వస్తే ఆమె ప్రతి షార్ట్ లో జీవించేసింది. నిజంగా ఈమె ఇంత బాగా నటిస్తుందని నాకు నిజంగా తెలియదు చాలా అద్భుతంగా నటించేసింది. ప్రాణం పెట్టి మరి నటించింది,”. అంటూ చెప్పుకొచ్చారు
ఇక ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ గురించి మనకి మరిన్ని విషయాలు అర్థమవుతాయి. ట్రైలర్ కరెక్ట్ గా గమనిస్తే.. అంజలి గర్భవతిగా ఉన్నప్పుడు భయపడి పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి ఫ్లాష్ బ్యాక్ లో ఉండే విలన్స్.. రామ్ చరణ్ ని.. అలానే అంజలిని చంపెయ్యగా.. అంజలి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఆ తరువాత చనిపోతదని అర్థమవుతుంది. ఆ ఇద్దరు పిల్లలే ఇప్పుడు రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న క్యారెక్టర్లు అయ్యి ఉండొచ్చు. వీరిద్దరూ అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయం సినిమా కథ అవ్వచ్చు అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఇక డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి.. అలానే ట్రైలర్ ని బట్టి చూస్తే రామ్ చరణ్ ఇందులో ద్విపాత్రాభినయం కాదు త్రిపాత్రాభినయం చేశారు అని అర్థమవుతుంది. కానీ ఇంకో ట్విస్ట్ కూడా ఉండొచ్చు.. అదేమిటంటే శంకర్ పోకిరి లెవెల్ సినిమా అన్నాడు కాబట్టి.. మనకు ఆకతాయిగా కనిపిస్తున్న రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయి ఉండొచ్చు. ఇలా అయితే ఈ సినిమాలో కేవలం రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసినట్లు అవుతుంది. ఇలా శంకర్ చెప్పిన మాటల్లోనే చాలా కథ లీక్ అవ్వడంతో.. రామ్ చరణ్ అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.