Rashmika Mandanna: ఎర్ర పట్టుచీరలో రష్మిక.. లేడీ పుష్ప రాజ్ లాగా ఫోజులు..

Rashmika Mandanna Pics: రష్మికా మందన్న గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ఎర్ర పట్టు చీరలో ఇచ్చిన కొన్ని ఫోజులు ప్రస్తుతం అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

  • Jan 25, 2024, 20:01 PM IST
1 /7

Rashmika Mandanna Pics: నాగ శౌర్య హీరోగా చేసిన ఛలో సినిమా ద్వారా పరిచయమైన కనడ బ్యూటీ రష్మికా మందన్న. ఆ తరువాత విజయ్ దేవరకొండ గీతాగోవిందం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

2 /7

తెలుగులో వరస ఆఫర్లు తెచ్చుకున్న రష్మిక కి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఫ్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చింది.

3 /7

పుష్ప సినిమాలో శ్రీవల్లిలా కనిపించి అందరిని మెప్పించింది రష్మిక. కాగా ఈ సినిమా ఆమెకు సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఎన్నో ఆఫర్లు తెచ్చిపెట్టింది.

4 /7

ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు అందుకుంటున్న రష్మిక ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 /7

ఈ ఫోటోలలో ఎర్ర పట్టుచీర కొట్టుకొని.. థగథగా మెరిసే ఎన్నో నగలు వేసుకొని.. నడుము చుట్టూ బెల్ట్ వేసుకుని మరి రష్మిక కనిపించింది.

6 /7

ఈ ఫోటోలు చూసిన వారందరూ ఈ ఫోటోలలో రష్మికానీ చూస్తే లేడీ పుష్ప రాజ్ ని చూసినట్టు ఉంది అని.. కాబట్టి ఈ ఫోటోలు పుష్ప 2 సినిమాలోవే ఏమో అని అందరూ అనుకున్నారు.

7 /7

అయితే ఈ ఫోటోలు వైరల్ అయిన కాసేపటికి రష్మిక టీమ్ ఇవి తను చెయ్యబోతున్న అడ్వటైజ్మెంట్ లో ఫోటోలు అని క్లారిటీ ఇచ్చింది.