Why Fruit Stickers: మార్కెట్‌లో ఎప్పుడైనా గమనించారా? పండ్లపై స్టిక్కర్లు ఎందుకు ఉంటాయో?

Why Put Stickers On Fruits This Is The Reason: పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి. ఏనాడైనా గమనించారా? ఆ స్టిక్కర్ల వెనుక చాలా కథ ఉంది. స్టిక్కర్లు లేని పండ్లు తక్కువ నాణ్యతతో ఉంటాయనే అపోహ కూడా ఉంది. పండ్లపై స్టిక్కర్లు ఎందుకు తెలుసుకోండి.

1 /7

స్టిక్కర్ల వెనుక చాలా కథ: మార్కెట్లో లభించే పండ్లపై కొన్ని స్టిక్కర్లు ఉంటాయి ఏనాడైనా గమనించారా? ఆ స్టిక్కర్ల వెనుక చాలా కథ ఉంది. పండ్లపై స్టిక్కర్లు వేస్తారో.. దానర్థం ఏమిటో తెలుసుకోండి.

2 /7

స్టిక్కర్ల వెనుక నేపథ్యం: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు ఉంటాయో చాలా మందికి కారణం తెలిసి ఉండకపోవచ్చు. స్టిక్కర్ ఉన్న పండ్లు నాణ్యమైనవని, అందుకే ధర ఎక్కువ అని వ్యాపారస్తులు నమ్మిస్తారు. వినియోగదారులు ఇవే నమ్మి పండ్లు కొనుగోలు చేస్తుంటాయి.

3 /7

ధర, నాణ్యత కాదు: పండ్లపై స్టిక్కర్లు ధరకు సంబంధించినది కాదు. పండ్ల నాణ్యత, ధరకు సంబంధించినవి కావు. యాపిల్, నారింజ వంటి పండ్లు కొనుగోలు చేసినప్పుడు వాటి స్టిక్కర్లను విధిగా చదవాలి. పండ్ల స్టిక్కర్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నంబర్ల ఆధారంగా స్టిక్కర్లు ఉంటాయి.

4 /7

4తో ప్రారంభమయ్యే కోడ్: కోడ్ 4తో ప్రారంభమయ్యే పండ్లకు ఒక విషయం చెబుతుంది. 4026, 4987 అనే కోడ్లతో ఉన్న పండ్లు క్రిమిసంహారకాలు, రసాయనాలు ఉపయోగించారని అర్థం. ఎరువులు, పురుగుమందులతో పండించిన పండ్లు అని అర్థం చేసుకోవాలి. మార్కెట్‌లో ఈ పండ్ల ధరలు చౌకగా ఉంటాయి. 

5 /7

8తో ప్రారంభమయ్యే కోడ్: కొన్ని పండ్ల స్టిక్కర్‌లపై కోడ్ 8తో మొదలవుతుంది. ఉదాహరణకు 84131, 86532.. అంటే ఈ పండ్లు సేంద్రీయమైనవి కావని అర్థం. అయితే ఈ పండ్లు చాలా ఖరీదైనవి.

6 /7

9తో ప్రారంభమయ్యే కోడ్: కోడ్ 9తో ప్రారంభమయ్యే పండ్లు సేంద్రియ పద్ధతుల్లో పండించినవి.  93435, 91435... వంటి కోడ్‌లతో ఉండే ఈ పండ్లు సేంద్రియ పద్ధతిలో పండించినవి. ఎలాంటి పురుగుమందులు వాడరు. ఇవి సురక్షితమైన పండ్లు. ఇవి ఖరీదైనవే అయినప్పటికీ ఆరోగ్యానికి చాలా మంచివి.

7 /7

నకిలీ స్టిక్కర్లను గుర్తించండి:  భారత మార్కెట్‌లోని కొన్ని పండ్లపై స్టిక్కర్లపై కోడ్ రాసి ఉండదు. దానికి బదులుగా ఇది ఎగుమతి నాణ్యత, ఉత్తమ నాణ్యత లేదా ప్రీమియం నాణ్యత అని రాసి ఉంటాయి. ఈ స్టిక్కర్లు నకిలీవి. పండ్లపై ఇటువంటి స్టిక్కర్లు అనుమతించబడవు.